1960 దశబ్దం లో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కి మొదటి లేడీ మేయర్ , విద్యావేత్త, సంఘ సంస్కర్త, నిస్వార్ధ రాజకీయవేత్త,బహుముఖ ప్రజ్ఞశాలి, అట్టడిగిన వర్గాలకి, కుష్టు వ్యాధిగ్రస్తుల అశా దీపం, వారిని అక్కున చేర్చుని ఆశ్రయం కల్పించిన అపర ధన్వంత్రి, సమాజం లో వెలివేయబడిన కుష్టు వ్యాధి గ్రాస్తులకు శివనంద రెహబిలిటేషన్ హోమ్ స్థాపించిన, సమాజo లోని అన్నివర్గాలవారికి అతి తక్కువ ధరలలో వైద్యాన్ని అందిస్తున్న రాందేవ్ రావు హాస్పిటల్ వ్యవస్థాపకురాలు, వడ్డేపల్లి సంస్థానానికి చెందిన ఆడపడుచు, వనపర్తి సంస్థానానికి చెందిన కోడలు ఐనటువంటి శ్రీమతి రాణి కుముదిని దేవి జన్మదినన్ని పురస్కరించుకొని శివనంద రెహబిలిటేషన్ హోమ్,రాందేవ్రావు హాస్పిటల్ మరియు కుముదిని దేవి స్కూల్ అండ్ కాలేజ్ అఫ్ నర్సింగ్ లో వివిధ కార్యక్రమాలు జరిపించారు, దీని లో మొదటగా రాందేవ్రావు హాస్పిటల్ లో రాణి కుముదిని దేవి చిత్ర పటానికి రాందేవ్ రావు హాస్పిటల్ MD Dr కమలాకర్ పూల మాల వేసారు, ఈ కార్యక్రమం లో డాక్టర్స్, నర్సెస్, అడ్మినిస్ట్రేషన్ మరియు ఇతర ఆసుపత్రి సిబ్బంది పాల్గొని మేడం చేసిన కార్యక్రమాలు కొనియాడారు.
శివనంద రెహబిలిటేషన్ హోమ్ లో మేడం యొక్క విగ్రహానికి రంతిదేవ్ రావు , మీరా రావు , విక్రందేవ్ రావు , జ్యోతి రావు , విజయలక్ష్మి ,పృథ్వీరెడ్డి , భారతి రెడ్డి ,విష్ణువర్ధన్ రెడ్డి ,అపర్ణ రావు , ప్రశాంత్ రెడ్డి , శివానంద రిహబిలిటేషన్ హోమ్ CAO Dr అనంత్ రెడ్డి పూల మాలతో మేడం విగ్రహాన్ని అలంకరించారు.
జస్టిస్ జగన్నాద్ రెడ్డి సతీమణి గారైనటువoటి పరిమళ జగన్మోహన్ రెడ్డి పేరు మీద ఉచిత శివనంద ఫిజియో రిహబ్ సెంటర్ ప్రదీప్ చౌదరి ప్రారంభించారు. పరిమళ జగన్ మోహన్ రెడ్డి చిత్రపటాన్ని జయరాం పింగళి , ఊర్మిళ పింగళి , గౌతమ్ పింగళి , సురేఖ పింగళి , విద్యాసాగర్ రావు , దీపిక ఆవిష్కరించారు. తర్వాత రాణి కుముడిని దేవి స్కూల్ అండ్ కాలేజీ అఫ్ నర్సింగ్ లో కొత్తగా ప్రవేశించిన Bsc మరియు GNM విద్యార్థిని విద్యార్థులకు లాంప్ లైటింగ్ ceremony ప్రారంభించారు.ఫ్లోరెన్స్ నైటింగేల్ ప్రతిజ్ఞ ను శ్రీమతి మేరీ డేవిడ్ మరియు కాలేజీ ప్రిన్సిపాల్ శ్రీమతి అర్చన విద్యార్థులచేత ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమం లో రాందేవ్ రావు హాస్పిటల్ మెడికల్ డైరెక్టర్ Dr కమలాకర్ , CEO Dr యోబు మరియు ఇతర హాస్పిటల్ మరియు కాలేజ్ సిబ్బంది పాల్గొన్నారు.
