లోటస్ ఐఐటి – నీట్ ఫౌండేషన్ పాఠశాలలో సరస్వతి అమ్మవారి జయంతి
స్థానిక లోటస్ ఐఐటీ -నీట్ ఫౌండేషన్ పాఠశాలలో సరస్వతీ అమ్మవారి జయంతి సందర్భంగా వసంత పంచమి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఇట్టి కార్యక్రమంలో భాగంగా సర్వవిద్యలకు ఆధారం సరస్వతి దేవి కనుక పాఠశాలలో చిన్న పెద్ద తేడా లేకుండా పుస్తకాలు, కలాలు అమ్మవారి దగ్గర పెట్టి అమ్మవారిని ఆరాధించడం జరిగింది . అంతేగాకుండా వసంత పంచమి విశిష్టతను, జ్ఞానానికి,విద్యకు, కలలకు ఆదిదేవత అయిన సరస్వతి దేవికి గల శారద,వాణి,భారతి వీణపాణి, జ్ఞానేశ్వరి, శ్వేతాంబర విద్యా రూపీని వంటి అనేక పేర్లతో అమ్మవారిని పిలుస్తారని, బ్రహ్మ దేవుని శక్తి గా,సకల కళలను ప్రసాదించే తల్లిగా ఆమెను ఆరాధిస్తారని విద్యార్థిని విద్యార్థులకు తెలియజేయడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో పాఠశాల చైర్మన్ నందకిషోర్, సింధు , ప్రిన్సిపాల్ డి. సైదులు యాదవ్, డైరెక్టర్లు కే చంద్రశేఖర్ , టి .అంజయ్య , కరస్పాండెంట్ బి. రామారావు, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు మరియు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.
