చిలకలూరిపేటలో కాప్రి గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్ ప్రారంభం…
చిలకలూరిపేట పట్టణం గాంధీపేటలో కాప్రి వారి గోల్డ్ లోన్స్ నూతన బ్రాంచ్‌ను శాసన మండలి సభ్యులు మర్రి రాజశేఖర్ ముఖ్య అతిథిగా హాజరై ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా సంస్థ యాజమాన్యానికి ఆయన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాప్రి సంస్థ ASM కక్కెర రామకోటేశ్వరరావు మర్రి రాజశేఖర్ తో మాట్లాడుతూ కాప్రి గోల్డ్ లోన్స్ సంస్థ దేశవ్యాప్తంగా సుమారు 856 బ్రాంచ్‌లతో సేవలందిస్తోందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనూ 40 బ్రాంచ్‌లతో విస్తృతంగా ప్రజలకు సేవలు అందిస్తున్నామని తెలిపారు.అత్యల్ప వడ్డీ రేటుతో బంగారంపై రుణాలు మంజూరు చేస్తూ ప్రజల అభిమానాన్ని సంపాదించుకుంటున్నామని తెలియజేశారు.ఈ చిలకలూరిపేట బ్రాంచ్‌నకు గుగ్గిలం హేమచంద్ర మేనేజర్‌గా, పవన్ కుమార్, అజిత్ బాబు, అనిల్ స్టాఫ్‌గా పని చేయనున్నట్లు తెలియజేశారు.
