గంధం చిన్న బాలయ్య సంస్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

TEJA NEWS

గంధం చిన్న బాలయ్య సంస్కరణ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి; గంధం చిన్న బాలయ్య * ఆరవ వర్ధంతి సంస్మరణ కార్యక్రమానికి మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొని గంధం చిన్న బాలయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా *మాజీ మంత్రి * మాట్లాడుతూ గంధం చిన్న బాలయ్య కుటుంబంతో తనకున్న అనుబంధం 50 సంవత్సరాలది, నన్ను ఎప్పుడు ప్రేమగా ఆప్యాయతతో పలకరించేవారని,
గంధం చిన్న బాలయ్య ఆ రోజుల్లో తన వృత్తిలో ఉంటూ తాను బ్రతుకుతూ ఎంతోమంది జీవితాలకు బ్రతుకు ఇచ్చారు ఎన్నో దేవాలయాలకు మసీదులకు దర్గాలకు చర్చిలకు ద్వారాలు నిర్మిస్తూ ఆర్థిక సహాయాలు చేయడం జరిగినది ఎంతో మంది పేద విద్యార్థులకు చదువుకొనుటకు ఆర్థిక సహాయ సహకారాలు అందించారు పాఠశాలలకు వసతుల సౌకర్యాలకు ఎంతగానో తోడ్పడ్డాడు వనపర్తి పట్టణంలోని నట్టా నడిబొడ్డున ఉన్న అంబేద్కర్ విగ్రహాన్ని స్థాపించుటకు తాను ఆర్థికంగా ఎంతగానో సహాయం చేశాడనీ నమ్ముకున్న సిద్ధాంతానికి దేనికైనా ముందుండేవాడు తన దగ్గరకి సహాయం కోరి వచ్చిన వారికి తన వృత్తిపరంగా సహాయం చేసేవాడని ఆయన గురించి స్మరిస్తూ ఆయన పేరున ఏ కార్యక్రమం చేసిన నిరంతరంగా ప్రజల్లో ఉండే పని ఏదైనా సరే నేను అన్ని విధాలుగా సహాయపడతానని సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు

ఈ కార్యక్రమంలో ప్రజా వైద్యశాల డాక్టర్ మురళీధర్ రాహుల్ హాస్పిటల్ డాక్టర్ రాఘవులు డాక్టర్ భగవంతు వెంకట్రావు మాణిక్యం గంధం పరంజ్యోతి చిట్యాల రాము జన జ్వాల రాధాకృష్ణ శంకర్ గౌడ్ పుట్ట ఆంజనేయులు జోగు శాంతన్న డప్పు స్వామి గులాం ఖాదర్ ఖాన్ నీల స్వామి గంధం విజయ్ కుమార్ సయ్యద్ జమీల్ గోపాలకృష్ణ అనుపటి రాము మంద రాము గంధం జాన్రాజ్ కృపానందం గౌడ్ శ్రీకర్ గౌడ్ మురళి తదితరులు పాల్గొని గంధం చిన్న బాలయ్య కి నివాళులర్పించడం జరిగినది

You cannot copy content of this page

Scroll to Top