శివమ్మా కాలనీ సమస్యలపై పాదయాత్ర చేసిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 అల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలోని శివమ్మా కాలనీ లో పెండింగ్ లో ఉన్న అభివృద్ధి పనుల పై డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎమ్.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి పాదయాత్ర చేసి సమస్యలను పరిశీలించడం జరిగింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ శివమ్మా కాలనీలో కొంతమేర డ్రైనేజీ మరియు సీసీ రోడ్లకు సంబందించిన పెండింగ్ వర్క్స్ ఉన్నాయని, వాటిని శేరిలింగంపల్లి శాసనసభ్యులు పి.ఎ.సి చైర్మన్ అరేకపూడి గాంధీ దృష్టికి మరియు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి శాంక్షన్ చేయించి అతి త్వరలో నిర్మాణ పనులు మొదలుపెడతామని హామీ ఇచ్చారు. కాలనీ తొంబై శాతం పైనే అభివృద్ధి పనులన్నీ పూర్తయ్యాయని, కొత్తమేర పెండింగ్ లో ఉన్న పనులను త్వరలో పూర్తి చేస్తామని తెలియచేసారు. డ్రైనేజీ మ్యాన్ హోల్ లోపల ప్లాస్టిగ్ లేక నిరంతరం పుడుకుపోయి జామ్ అవుతున్న సమస్యను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకువచ్చారు. కార్పొరేటర్ వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి వీలైనంత త్వరగా మ్యాన్ హోల్స్ అన్నింటికీ లోపలవైపు సిమెంట్ ప్లాస్టింగ్ చేసి సమస్యను పరిష్కరించాలని తెలిపారు.
కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, కాలనీ ప్రెసిడెంట్ కె.నరసింహులు, మన్యం, ఆది నారాయణ, గిరి, రాఘవేంద్ర, కృష్ణ, శ్రీను, బి.నరసింహ, రమేష్, సురేష్, సుధాకర్, సత్తయ్య, రమేష్, రవీందర్.
జి.ఎచ్.ఎమ్.సి అధికారులు ఎస్.ఆర్.పి నాగేశ్వర నాయక్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, UBD నాగరాణి, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, వాటర్ వర్క్స్ సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ వెంకటరెడ్డి & మల్లేష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
