గ్రామ పంచాయతీలకు 11200 కోట్లు విడుదల చేసినందుకు చంద్రబాబు నాయుడు

TEJA NEWS

గ్రామ పంచాయతీలకు 11200 కోట్లు విడుదల చేసినందుకు చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి కృతజ్ఞతలు… వై.వి.బి. రాజేంద్రప్రసాద్.

ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చాంబర్ మరియు సర్పంచుల సంఘం ఆధ్వర్యంలో విశాఖ నగరంలో వి.జె.ఎఫ్ ప్రెస్ క్లబ్ నందు విలేకరుల సమావేశం నిర్వహించబడింది.

ఈ విలేకరుల సమావేశంలో పంచాయతీరాజ్ చాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ

పంచాయతీరాజ్ చాంబర్ మరియు సర్పంచుల సంఘం పోరాటాల ఫలితంగా

పల్లె పండుగ మొదటి విడత కింద గ్రామాల అభివృద్ధికి 4600 కోట్లు ,పల్లె పండుగ రెండవ విడత కింద 2600 కోట్లు విడుదల చేసినందుకు.

జల్జీవన్ మిషన్ కింద త్రాగు నీటి అవసరాల కోసం వేల కోట్లు నిధులు విడుదల చేసినందుకు.

18 నెలల కాలంలోనే 15 వ ఆర్థిక సంఘం నిధులు ₹4,200 కోట్లను గ్రామపంచాయతీలకు, మండల పరిషత్తులకి, జిల్లా పరిషత్తులకు ఎప్పటికప్పుడు విడుదల చేసినందుకు.

వాలంటీర్ వ్యవస్థను రద్దు చేసినందుకు

ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కి, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి, ప్రధాని నరేంద్ర మోడీ కి రాజేంద్రప్రసాద్ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు సర్పంచులు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, ఎంపీపీలు, జిల్లా పరిషత్ చైర్మన్లకు గౌరవ వేతనం పెంచాలని,
కొన్ని ప్రాంతాల్లో ఇంకా విడుదల కాకుండా ఉన్న స్టాంప్ డ్యూటీ మరియు ప్రొఫెషనల్ టాక్స్ నిధులను గ్రామపంచాయతీలకు అడ్జస్ట్ చేయాలని, అలాగే పల్లె పండుగ కార్యక్రమం ద్వారా చేపట్టిన పనులకు సంబంధించిన పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని ,

గ్రామపంచాయతీలు, మండల పరిషత్తులు, జిల్లా పరిషత్తులు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు సకాలంలో ఎన్నికలు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వానికి రాజేంద్రప్రసాద్ విజ్ఞప్తి చేశారు.

ఈ విలేకరుల సమావేశంలో పంచాయతీరాజ్ ఛాంబర్ రాష్ట్ర అధ్యక్షులు వై.వి.బి. రాజేంద్రప్రసాద్, సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీమతి వానపల్లి లక్ష్మి ముత్యాల్ రావు,రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాప్ రెడ్డి, ఉపాధ్యక్షులు వానపల్లి ముత్యాలరావు, అనకాపల్లి జిల్లా సర్పంచుల సంఘం అధ్యక్షులు చింతకాయల ముత్యాలు, అల్లూరి సీతారామరాజు జిల్లా పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు బొర్రా నాగరాజు, చిత్తూరు జిల్లా పంచాయతీరాజ్ చాంబర్ అధ్యక్షులు చుక్క ధనుంజయ యాదవ్ లు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top