ఆడ మగ తేడా కనిపించని మరుగుదొడ్లు.. బస్టాండ్ లో అవమానాలకు గురౌతున్న మహిళలు
రాష్ట్రంలో గుర్తింపు ఉన్న 2వ బస్టాండు: కానీ పేరు పెద్ద ఊరు దిబ్బలా తయారైంది:
ఏళ్లు గడుస్తున్నా.. మరమ్మత్తులు చేయరు: పారిశుద్ధ్యన్ని మెరుగుపరచారు:
కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో చెత్త పేరు కొనిపోయి ఒకవైపు దుర్వాసన మరో వైపు శిరిలమై మరుగుదొడ్లపై పై బొమ్మలు కనిపించక నిరక్షరాస్యులుగా ఉన్న మహిళలు అవమానాలకు గురవుతున్నారని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఎం నాగరాజు, ఇరిగినేని పుల్లారెడ్డి, ఏ వెంకటేశ్వర్లు, టి షంషుద్దీన్,మానవతా సేవా సంస్థ ప్రతినిధి సిహెచ్ శోభన్ బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఈరోజు ఉదయం స్థానికులతో కలిసి పిపిఎస్ఎస్ ప్రతినిధి బృందం కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ పరిసరాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎన్టీ రామారావు సీఎంగా ఉన్న సమయంలో నిర్మించిన ఆర్టీసీ బస్టాండ్ల ప్రభుత్వాలకు నిర్వహణ కూడా చేతకావడం లేదని విమర్శించారు.
రాష్ట్రంలో రెండవ అతిపెద్ద బస్టాండ్ గా గుర్తింపు ఉన్నప్పటికీ పేరు పెద్ద ఊరు దిబ్బ అనే చందంగా తయారైదన్నారు.ప్రయాణికులతో పాటు చుట్టూ ఉండే ప్రజలు దుర్వాసన వల్ల ముక్కు మూసుకుని వెళ్లే పరిస్థితి దాపరించిందన్నారు. గత ఇదేలుగా ఆర్టీసీ అధికారులకు ఎన్ని అర్జీలు ఇచ్చినా.. మరమ్మతులు లు గానీ..చేయరు పారిశుధ్యని మెరుగుపరచాలనే చిత్తశుద్ధీ గాని లేదన్నారు. గతంలో కలెక్టరు,ఆర్టీసీ చైర్మన్లు బస్టాండ్లో పర్యటించి హెచ్చరించినా అధికారులు స్పందించడం లేదనీ తెలిపారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బస్టాండును మరమ్మత్తులు చేసి పారిశుధ్యం మెరుగుపరచాలనీ కోరారు. ఈ కార్యక్రమంలో మహమ్మద్ యునూస్, ఇ లక్ష్మణ గౌడు,ఎస్ అన్వర్ భాష,సివి వర్మ, s రమణ గౌడు, బి రాజు పాల్గొన్నారు.
