ఫిబ్ర‌వ‌రి 8 నుంచి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

TEJA NEWS

ఫిబ్ర‌వ‌రి 8 నుంచి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు

** 15న రథోత్సవం, నందివాహనం

** 16న సాయంత్రం శివపార్వతుల కళ్యాణం

తిరుపతి: తిరుమలకు వెళ్లే దారిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్ర‌వ‌రి 8 నుంచి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. ఫిబ్రవరి 04వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.

వాహనసేవల వివరాలు:

ఫిబ్రవరి 08న ఉద‌యం – ధ్వజారోహణం (ఉ.6.05 గంట‌ల‌కు – మ‌క‌ర ల‌గ్నం),
ప‌ల్ల‌కీ సేవ‌ (ఉ.7 నుంచి 9 గంట‌ల వ‌ర‌కు), రాత్రి – హంస వాహనం, 09న
ఉద‌యం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం,10న ఉద‌యం – భూత వాహనం, రాత్రి – సింహ వాహనం, 11న ఉద‌యం – మకర వాహనం,
రాత్రి – శేష వాహనం, 12న ఉద‌యం – తిరుచ్చి ఉత్సవం, రాత్రి – అధికారనంది వాహనం,13న ఉద‌యం – వ్యాఘ్ర వాహనం, రాత్రి – గజ వాహనం, 14న ఉద‌యం – కల్పవృక్ష వాహనం, రాత్రి – అశ్వ వాహనం, 15న ఉద‌యం – రథోత్సవం (భోగితేరు), రాత్రి – నందివాహనం, 16న ఉద‌యం – పురుషామృగ వాహనం (ఉ.8 నుంచి 10 గంట‌ల వ‌ర‌కు), సాయంత్రం – శివపార్వతుల కల్యాణోత్సవం (సా.6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు), రాత్రి – తిరుచ్చి ఉత్సవం (రా.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు), 17న ఉద‌యం – సూర్యప్ర‌భ వాహ‌నంపై న‌ట‌రాజ‌స్వామి వారు (ఉ.6.30 నుండి 9 గంట‌ల వ‌ర‌కు), త్రిశూలస్నానం (ఉ.9 నుండి 10.30 గంట‌ల వ‌ర‌కు), సాయంత్రం – ధ్వజావరోహణం (సా.6 నుండి రాత్రి 7.30 గంట‌ల వ‌ర‌కు), రాత్రి – రావణాసుర వాహనం (రా.8 నుండి 10 గంట‌ల వ‌ర‌కు). ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.

You cannot copy content of this page

Scroll to Top