ఫిబ్రవరి 8 నుంచి కపిలేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
** 15న రథోత్సవం, నందివాహనం
** 16న సాయంత్రం శివపార్వతుల కళ్యాణం
తిరుపతి: తిరుమలకు వెళ్లే దారిలోని శ్రీ కపిలేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 8 నుంచి 17వ తేదీ వరకు వైభవంగా జరగనున్నాయి. ఇందులో భాగంగా ఫిబ్రవరి 7న శాస్త్రోక్తంగా అంకురార్పణ కార్యక్రమం జరుగనుంది. ఫిబ్రవరి 04వ తేదీన కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం నిర్వహిస్తారు. ప్రతిరోజూ ఉదయం 7 నుంచి 9 గంటల వరకు, తిరిగి రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
వాహనసేవల వివరాలు:
ఫిబ్రవరి 08న ఉదయం – ధ్వజారోహణం (ఉ.6.05 గంటలకు – మకర లగ్నం),
పల్లకీ సేవ (ఉ.7 నుంచి 9 గంటల వరకు), రాత్రి – హంస వాహనం, 09న
ఉదయం – సూర్యప్రభ వాహనం, రాత్రి – చంద్రప్రభ వాహనం,10న ఉదయం – భూత వాహనం, రాత్రి – సింహ వాహనం, 11న ఉదయం – మకర వాహనం,
రాత్రి – శేష వాహనం, 12న ఉదయం – తిరుచ్చి ఉత్సవం, రాత్రి – అధికారనంది వాహనం,13న ఉదయం – వ్యాఘ్ర వాహనం, రాత్రి – గజ వాహనం, 14న ఉదయం – కల్పవృక్ష వాహనం, రాత్రి – అశ్వ వాహనం, 15న ఉదయం – రథోత్సవం (భోగితేరు), రాత్రి – నందివాహనం, 16న ఉదయం – పురుషామృగ వాహనం (ఉ.8 నుంచి 10 గంటల వరకు), సాయంత్రం – శివపార్వతుల కల్యాణోత్సవం (సా.6 నుండి రాత్రి 7.30 గంటల వరకు), రాత్రి – తిరుచ్చి ఉత్సవం (రా.8 నుండి 10 గంటల వరకు), 17న ఉదయం – సూర్యప్రభ వాహనంపై నటరాజస్వామి వారు (ఉ.6.30 నుండి 9 గంటల వరకు), త్రిశూలస్నానం (ఉ.9 నుండి 10.30 గంటల వరకు), సాయంత్రం – ధ్వజావరోహణం (సా.6 నుండి రాత్రి 7.30 గంటల వరకు), రాత్రి – రావణాసుర వాహనం (రా.8 నుండి 10 గంటల వరకు). ఉత్సవాల సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ప్రతిరోజూ వాహనసేవల ముందు కోలాటాలు, భజన కార్యక్రమాలను నిర్వహించనున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య సంకీర్తనలను ఆలపించనున్నారు.
