శ్రీ గాలి పోచమ్మ ఆలయాన్ని దర్శించుకున్న*కంటెస్టెడ్ కార్పొరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్
కుత్బుల్లాపూర్ నియోజకవర్గం లోని దేవేందర్ నగర్ లో గల ( గాలి పోచమ్మ బస్తి )గల శ్రీ గాలి పోచమ్మ ఆలయ జాతర సందర్భంగా ఆలయంలో ఏర్పాటు చేసిన అమ్మవారి పూజా కార్యక్రమంలో పాల్గొన్న కంటెస్టెడ్ కార్పోరేటర్ కూన శ్రీనివాస్ గౌడ్ ….
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆ గాలి పోచమ్మ తల్లి ఆశీస్సులు దీవెనలు, కృపా కటాక్షాలు, అమ్మవారి ఆశీస్సులు ప్రజలందరి పై ఉండాలని ఆకాంక్షించారు, అనంతరం ఆలయ కమిటీ వారు శాలువాతో సత్కరించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకుడు బుచ్చిరెడ్డి మరియు ఆలయ కమిటీ సభ్యులు డాన్ శీను, నరసింహ, కాంగ్రెస్ నాయకులు మోతే శ్రీను, ప్రసాద్, జహంగీర్, తోసిపు, రజాక్ ఇతర డివిజన్ నాయకులు మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు…
