శివయ్య సేవ”లో ప్రజాసేవకులు బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ …
ద్వాదశ జ్యోతిర్లింగ 25వ మహా పడిపూజ వాల్ పోస్టర్ ఆవిష్కరణ…..శివ స్వాములు, భక్తుల సౌకర్యార్థం నూతనంగా నిర్మించనున్న వంటశాల మరియు డైనింగ్ హాల్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన.
125 – గాజుల రామారం డివిజన్ నల్లగుట్ట శ్రీ భ్రమరాంభ మల్లికార్జున దేవస్థానం (చిన్న శ్రీశైలం)లో నిర్వహించిన ద్వాదశ జ్యోతిర్లింగ 25వ మహా పడిపూజ వాల్ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమానికి బిఆర్ఎస్ ఎల్పీ విప్, ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై ఫిబ్రవరి 1న నల్లగుట్ట శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి దేవాలయం ఆవరణలో నిర్వహించనున్న ద్వాదశ జ్యోతిర్లింగ 25వ మహా పడిపూజ వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. అంతకముందు శ్రీ భ్రమరాంభ మల్లికార్జున స్వామి వారికి ఎమ్మెల్యే ప్రత్యేక అభిషేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా దేవాలయం ఆవరణలో మౌళిక వసతుల కల్పనపై పలు సమస్యలను ఎమ్మెల్యే కి విన్నవించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. భ్రమరాంబ మల్లికార్జున స్వామి కృపా కటాక్షాలు సంపూర్ణంగా భక్తులపై ఉండాలని, 25 సంవత్సరాల క్రితం కొంతమంది స్వాములతో గురుస్వామి, అలయ ధర్మకర్త దూదిమెట్ల సోమేష్ యాదవ్ ఆధ్వర్యంలో ఇక్కడ ప్రారంభమైన శివదీక్ష ఈ సంవత్సరం 108 స్వాముల దీక్షా తీసుకునేలా దేవాలయం అభివృద్ధి చెందిందని అన్నారు. దేవాలయ అభివృద్ధికి తన సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయన్నారు. అనంతరం శివ స్వాములు, భక్తుల సౌకర్యార్థం నిర్మించనున్న వంటశాల మరియు డైనింగ్ హాల్ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో శివ గురుస్వాములు పెంటయ్య, యాది లాల్, సురేష్ రెడ్డి, లవీర్ రెడ్డబోయిన, క్రిష్ణా రెడ్డి, యాదమ్మ, రాజు, కార్పొరేటర్ మంత్రి సత్యనారాయణ, నిజాంపేట్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్, పాక్స్ డైరెక్టర్ పరుష శ్రీనివాస్ యాదవ్, శ్రీ వెంకటేశ్వర దేవస్థానం మాజీ చైర్మన్ వేణు యాదవ్, డివిజన్ అధ్యక్షులు విజయ్ రాంరెడ్డి, పుప్పాల భాస్కర్, రుద్ర అశోక్, పోలే శ్రీకాంత్, సీనియర్ నాయకులు అంజన్ గౌడ్, కస్తూరి బాల్ రాజ్, అడ్వకేట్ కమలాకర్, నవాబ్ భాయ్, తెలంగాణ సాయి, చెట్ల వెంకటేష్, తారా సింగ్, బోయిని మహేష్, ప్రభుదాస్, ప్రసాద్, శివా నాయక్, గౌస్, శివ స్వాములు తదితరులు పాల్గొన్నారు.
