మండల సమైక్య ఈసీ సమావేశం
ప్రభుత్వం నుంచివచ్చే పథకాలు సద్వినియోగం చేసుకోవాలి
ప్రతి కుటుంబంలో మహిళా పారిశ్రామిక వేత్త కావాలి
ఏపియం వి.సుబ్బరాజు
కోవూరు వెలుగు కార్యాలయం నందు ఎపి యం వి. సుబ్బరాజు పర్యవేక్షణలో అధ్యక్షురాలు రమ్య ఆధ్వర్యంలో మండల సమైక్య ఈసీ సమావేశం నిర్వహించడమైనది. ఈ సమావేశంలో సిఐఎఫ్, గ్రామనిది, ఈనారి సిఆర్పి వ్యవస్థ గురించి, సి బి ఓ అకౌంటింగ్, వివో జిబి సమావేశాలు, వీ పి ఆర్ పి ప్లాన్స్,బ్యాంకు లింకేజీ గ్రౌండింగ్, శ్రీనిధి, ఉన్నతీ రుణాలు, పీఎం అజయ్, ఈఎంఈజీపి, పీఎం ఎఫ్ఎం ఇ, సీడ్ క్యాపిటల్ లోన్స్, న్యూట్రి ఎంటర్ప్రైజెస్, ప్రకృతి వ్యవసాయం గురించి ఎపియం వి. సుబ్బరాజు తెలియజేయడం జరిగింది. ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి ఒక్కటి పొదుపులో ఉన్న మహిళలు వినియోగించుకోవాలని వీటిని పదిమందికి తెలియజేయాలని మహిళల అభివృద్ధి మన ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు.. ఈ సమావేశంలో సీసీలు మురళి, రాము, శోభ, శ్రీలత, అకౌంటెంట్ సుధా,జాబ్స్ సెక్షన్ నుండి సుగుణ, ప్రకృతి వ్యవసాయం మాస్టర్ ట్రైనర్ భావజాన్, నాగ లత, పొదుపు మహిళలు ఉన్నారు..
