కోవూరు నియోజకవర్గాన్ని రూపురేఖలు మారుస్తాం
త్వరలో కోవూరును నగర పంచాయతీగా చేస్తాం
సీసీ రోడ్ల ప్రారంభోత్సవంలో కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి..
భీష్మ ఏకాదశి సందర్భంగా సీతారామ దేవస్థానంలో ప్రత్యేక పూజలు
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 18 నెలల్లో కోవూరు లో రూ.6.50 కోట్లతో వివిధ రకాల అభివృద్ధి పనులు చేయటం జరిగిందని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి తెలిపారు.కోవూరు పట్టణంలోని 13, 14వార్డులలో 32 లక్షలతో నిర్మించిన సిసి రోడ్లను ప్రారంభించారు.ఈ సందర్భంగావారు మాట్లాడుతూ..గత ప్రభుత్వంలో 15 ఫైనాన్స్ నిధులు దుర్వినియోగం అయ్యాయని, కనీసం ఒక పని కూడా చేయలేదన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సిసి రోడ్లు నిర్మాణం తోపాటు విలేజ్ హెల్త్ క్లినిక్స్ వంటి కార్యక్రమాలు చేపట్టామన్నారు.దశాబ్దాలు నుంచి ఇబ్బందికరంగా ఉన్న పీటర్ కెనాల్ కాలువపై వంతెననిర్మించామన్నారు.రానున్న రోజుల్లో మరిన్ని అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతామన్నారు.
అలాగే త్వరలో కోవూరును నగర పంచాయతీగా రూపుదిద్దుతామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అభివృద్ధి సంక్షేమం రెండు సమపాలల్లో ముందుకు తీసుకెళ్తున్నారన్నారు.అనంతరం భీష్మ ఏకాదశి పురస్కరించుకొని శ్రీ సీతారామస్వామి ని దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఈ కార్యక్రమంలో కోవూరు మండల అధ్యక్షులు కొల్లారెడ్డి సుధాకర్ రెడ్డి, పెన్నా డెల్టా ఛైర్మెన్ రాజగోపాల్ రెడ్డి, జొన్నవాడ ఆలయ చైర్మన్ తిరుమూరు అశోక్ రెడ్డి, ఎంపీపీ తుమ్మల పార్వతి, సర్పంచ్ ఏకశిరి విజయ, ఇంతా మల్లారెడ్డి కాటంరెడ్డి కృష్ణారెడ్డి, తాటిపర్తి విజయ్ రెడ్డి, పబ్బారెడ్డి మల్లికార్జున్ రెడ్డి, సాయి తేజ రెడ్డి,దారపనేని శ్రీనివాస్ నాయుడు, బత్తల రమేష్, బెల్లంకొండ విజయ్ పాలూరు వెంకటేశ్వర్లు బీదా భాస్కర్ రావు, కొండా తిరుపతిరెడ్డి, నాటక రాణి వెంకట్, మైనార్టీ నాయకులు షేక్. జహంగీర్, షేక్. జమీర్, బిజెపి మండల అధ్యక్షుడు సుబ్బారావు మరియు కూటమి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు..
