సూర్యాపేట గడ్డ బీసీల అడ్డ : వట్టె జానయ్య యాదవ్

TEJA NEWS

సూర్యాపేట గడ్డ బీసీల అడ్డ : వట్టె జానయ్య యాదవ్

ఏ ఫార్ములు సమర్పించిన తెలంగాణ రాజ్యాధికార పార్టీ

సూర్యాపేట జిల్లా :
తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో ఏ ఫార్ములు సమర్పించే కార్యక్రమంలో భాగంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ నేతలు సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్‌ను కలిసి అధికారికంగా ఏ ఫార్మ్‌ను సమర్పించారు. ఈ కార్యక్రమానికి పార్టీ రాష్ట్ర కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ నేతృత్వం వహించారు. ఈ సందర్భంగా జానయ్య యాదవ్ మాట్లాడుతూ… రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో జరిగే ఎన్నికలకు తెలంగాణ రాజ్యాధికార పార్టీ పూర్తిగా సిద్ధంగా ఉందన్నారు. సూర్యాపేట జిల్లా పరిధిలోని అన్ని మున్సిపాలిటీల్లో పార్టీ పోటీకి దిగుతుందని స్పష్టం చేశారు. ముఖ్యంగా సూర్యాపేట మున్సిపాలిటీలో మొత్తం 48కి 48 వార్డుల్లో పార్టీ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నామని ప్రకటించారు.

ఇప్పటివరకు సూర్యాపేట రాజకీయాల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు తగిన ప్రాధాన్యం దక్కలేదని ఆయన విమర్శించారు. ఇప్పటికీ అదే తరహా కుట్రలు కొనసాగుతున్నాయని, రెండు ప్రధాన పార్టీలు కలిసి మున్సిపల్ ఎన్నికలను కుయుక్తులతో కైవసం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితుల్లో ప్రజలు ఆలోచనతో నిర్ణయం తీసుకొని తమ సొంత పార్టీ అయిన తెలంగాణ రాజ్యాధికార పార్టీకి మద్దతు ఇచ్చి ఓటు వేయాలని సూర్యాపేట ఓటర్లను కోరారు. ఈసారి “సూర్యాపేట గడ్డ బీసీల అడ్డ” అన్న నినాదం పార్టీతో పాటు జిల్లా ప్రజల్లోనూ గట్టి నమ్మకంగా మారిందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ నీరజ గౌడ్, సూర్యాపేట జిల్లా మహిళా అధ్యక్షురాలు కొన్నే మంజుల గౌడ్, కార్యదర్శి నారాయణదాసు కవిత, నాయకులు మామిడి శోభన్ బాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top