19వ వార్డు కౌన్సిలర్ గా కొల్లా ప్రసన్న లక్ష్మి కోటిరెడ్డి నామినేషన్ దాఖలు

TEJA NEWS

19వ వార్డు కౌన్సిలర్ గా కొల్లా ప్రసన్న లక్ష్మి కోటిరెడ్డి నామినేషన్ దాఖలు


కోదాడ మున్సిపల్ ఎన్నికల్లో మున్సిపల్ పరిధిలోని 19వ వార్డుకు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ గా కొల్లా ప్రసన్న లక్ష్మి కోటిరెడ్డి అభిమానుల మధ్య మున్సిపల్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.ఈ సందర్భంగా ప్రసన్నలక్ష్మి కోటిరెడ్డి మాట్లాడుతూ 19 వ వార్డు ను అభివృద్ధి , ప్రజలకుసేవ చేసేందుకు ఎన్నికల్లో మీ ముందుకు వస్తున్నానని పెద్ద మనసుతో ఆశీర్వదించి మీ అమూల్యమైన ఓటు వేసి అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు.19 వ వార్డులో అనేక మౌలిక సదుపాయాల విద్యుత్ వీధిదీపాలు, మంచినీటి సరఫరా, డ్రైనేజీ వ్యవస్థ , సీసీరోడ్లు, వార్డు పరిశుభ్రత పరిష్కారానికి అధికారుల సహాయ సహకారాలతో పరిష్కరించేందుకు కృషి చేస్తానని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోల్లా కోటిరెడ్డి,టి. వీరబాబు, బి.రాజు నాయక్, ఎం బ్రహ్మారెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, నాగమల్లేశ్వర్ రెడ్డి 19 వ వార్డు కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top