ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహణ
సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్–10, అండర్–14, అండర్–18 బాల, బాలికల కోసం జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్, కార్యదర్శి ఎల్. సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫిబ్రవరి 1వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటలకు స్థానిక టి.టి.డి కళ్యాణ మండపంలో ఈ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్స్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చదరంగం క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. టోర్నమెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కార్యదర్శి ఎల్. సతీష్ కుమార్‌ను చరవాణి నంబర్ 93947 53343 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.
