ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహణ

TEJA NEWS

ఉమ్మడి నల్లగొండ జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహణ

సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి : ఉమ్మడి నల్లగొండ జిల్లా అండర్–10, అండర్–14, అండర్–18 బాల, బాలికల కోసం జిల్లా స్థాయి చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు సూర్యాపేట జిల్లా చెస్ అసోసియేషన్ అధ్యక్షులు గండూరి కృపాకర్, కార్యదర్శి ఎల్. సతీష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఫిబ్రవరి 1వ తేదీ (ఆదివారం) ఉదయం 10 గంటలకు స్థానిక టి.టి.డి కళ్యాణ మండపంలో ఈ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ పోటీలలో ప్రతిభ చూపిన విజేతలకు నగదు బహుమతులు, షీల్డ్స్ అందజేయనున్నట్లు తెలిపారు. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని చదరంగం క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు. టోర్నమెంట్‌కు సంబంధించిన మరిన్ని వివరాల కోసం కార్యదర్శి ఎల్. సతీష్ కుమార్‌ను చరవాణి నంబర్ 93947 53343 ద్వారా సంప్రదించవచ్చని తెలిపారు.

You cannot copy content of this page

Scroll to Top