ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు

TEJA NEWS

ఫిబ్రవరి 12వ తేదీన జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో కార్మికులు అందరూ పాల్గొని సమ్మెను విజయవంతం చేయాలని – సిఐటియు మండల కార్యదర్శి రాథోడ్ సంతోష్ అన్నారు..

నిజాంపేట్ అడ్డ BCW కార్మికులతో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని నిరసన కార్యక్రమం చేయడం జరిగింది..

  • కార్మిక చట్టాల రద్దు.. కార్మిక వర్గానికి ఉరితాడు పోరాడి సాధించుకున్న హక్కులను కాలరాసి హక్కు ఎవరికీ లేదు!

ఈ సందర్భంగా సిఐటియు బాచుపల్లి మండల కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ….కేంద్ర బిజెపి ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, విద్యుత్ సవరణ చట్టం-2025, విబి జి-రామ్ జీ చట్టం, విత్తన సవరణ బిల్లు, ఎల్ఐసిలో 100% విదేశీ పెట్టుబడులను అనుమతించడం లాంటి ప్రమాదకర నిర్ణయాలను ఉపసంహరించాలని, కార్మిక, ప్రజా, రైతు వ్యతిరేక విధానాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ కార్మికలు అందరూ 2026 ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో బాచుపల్లి మండల కార్మికవర్గం మొత్తం పాల్గొని జయప్రదం చేయాలని కోరారు బాచుపల్లి మండలంలో కార్మికులు, ఉద్యోగులు, ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ప్రజా సంఘాలు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము,
కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని నిరాయుధులను చేసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు బంగారు పళ్ళెంలో పెట్టి బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది.

వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడి ఇంతకాలం వాటిని అమలు చేయకుండా ఆపగలిగాము. బ్రిటీష్ ప్రభుత్వంతో పోరాడి సాధించుకున్న ట్రేడ్ యూనియన్ చట్టం-1926 ప్రకారం యూనియన్ల ఏర్పాటు కార్మికుల హక్కుగా పొందారు. కానీ ఈ లేబర్ కోడ్లతో కార్మికులు సంఘం పెట్టే హక్కు, సంఘటితమయ్యే హక్కు, నిరసనలు, సమ్మె చేసే హక్కులపై ఉక్కుపాదం మోపారు.కేంద్ర ప్రభుత్వం కార్మిక వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల విధానాలను ఉపసంహరించుకునేలా కార్మికవర్గం ప్రతిఘటనకు పూనుకోవాలని. లేబర్ కోడ్స్ రద్దయ్యే వరకు ఐక్యంగా సమరశీల పోరాటాలకు సిద్ధం కావాలని. సమ్మెతోనే పాలకవర్గానికి సమాధానం చెప్పాలని అన్నారు… ఈ కార్యక్రమంలో CITU సీనియర్ నాయకులు నాగభూషణ్ CITU నిజాంపేట్ అడ్డ కార్మికులు నర్సింహ,దత్తు,జగన్, శ్రీను, రాములు,ధనరాజు,దాస్, శ్రీనివాస్, నరేష్, కిషోర్ కార్మికులు తదితరులు పాల్గొన్నారు…

You cannot copy content of this page

Scroll to Top