మెగా 9 న్యూస్ ఛానల్ & నాదం తెలుగు దినపత్రిక” నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హన్మంత్ రెడ్డి చేతుల మీదుగా “మెగా 9 న్యూస్ ఛానల్ & నాదం తెలుగు దినపత్రిక – 2026 నూతన సంవత్సర క్యాలెండర్” ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా జరిగింది.
బాచుపల్లి లోని కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో కొలన్ హన్మంత్ రెడ్డి క్యాలెండర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నిర్భయంగా వెలుగులోకి తీసుకొచ్చే బాధ్యతాయుతమైన పాత్రను మీడియా నిర్వహించాలన్నారు. ప్రజాస్వామ్యంలో పత్రికల పాత్ర కీలకమని, మెగా 9 న్యూస్ ఛానల్ & నాదం తెలుగు దినపత్రిక ప్రజల గొంతుకగా ముందుకు సాగాలని ఆకాంక్షిస్తూ ………… మెగా 9 న్యూస్ ఛానల్ & నాదం తెలుగు దినపత్రిక యాజమాన్యనికి మరియు రిపోర్టర్ నవీన్ రాజు కి నూతన సంవత్సర క్యాలెండర్ దినపత్రిక అభివృద్ధికి మరింత ఉన్నత స్థాయికి రావాలని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో నిజాంపేట్ సర్కిల్ అధ్యక్షులు కోలన్ రాజశేఖర్ రెడ్డి, కోలన్ జీవన్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నాయకులూ బట్ట పాలకృష్ణ, సిద్దనోళ్ల సంజీవ రెడ్డి , మైసి గారి శ్రీనివాస్, చెన్నయ్య , ప్రశాంత్ రెడ్డి, ఆదిరెడ్డి, వేణు, చంద్రకళ తదితరులు పాల్గొన్నారు.
