శ్రీవారితో పెట్టుకుంటే పుట్టగతులుండవు
** టీటీడీ బోర్డు సభ్యుడు గుడిపల్లి భానుప్రకాష్
తిరుపతి: శక్తివంతమైన తిరుమల శ్రీవారితో పెట్టుకుంటే ఎంతటివారికైనా పుట్టగతులుండవని టీటీడీ బోర్డు సభ్యుడు అండ్ బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుడిపల్లి భానుప్రకాష్ రెడ్డి హెచ్చరిక చేశారు. తిరుమల లడ్డు ప్రసాదంలో జగన్ రెడ్డి, ఆయన గ్యాంగ్ లోని వైవీ సుబ్బారెడ్డి, భూమన కరుణాకర్ రెడ్డిలు చేసిన కల్తీనెయ్యి బాగోతంపై తిరుపతి ప్రెస్ క్లబ్ లో భానుప్రకాష్ మీడియాతో మాట్లాడారు. కల్తీ అనే మాటను టీటీడీతో పోల్చుకుంటేనే భయం, భక్తితో బాదేస్తుందని వ్యాఖ్యానించారు. 2019 నుంచి 2024 వరకు వైసిపి హయాంలో భూమన కరుణాకర్ రెడ్డి, జగన్ రెడ్డిలు తిరుమలలో విధ్వంసాలు చేశారని ఆరోపించారు. కాసులకు కక్కుర్తి పడి శ్రీవారి ప్రసాదాన్ని అపవిత్రం చేశారని విమర్శించారు.
కల్తీ నెయ్యి కేసులో వైసిపి నేతలకు “సిట్” క్లీన్ చిట్ ఇవ్వలేదని పేర్కొన్నారు. దీనిపై వైసిపి నేతలకు సవాల్ చేస్తున్నాను..నెయ్యి కల్తీ జరిగిందని స్పష్టంగా సిట్ నివేదిక ఇచ్చింది.
సిట్ నివేదించిన 219పేజీల ఛార్జ్ షీట్ ను వైసిపి నేతలకు పంపిస్తాను..ముందు ఛార్జ్ షీట్ చదవండి అని హితవు పలికారు. ఒక్క చుక్క పాలు లేకుండా నెయ్యిని తయారు చేశారని మండిపడ్డారు.
ఎస్ వాల్యు ప్రకారం 10శాతం కన్నా తక్కువ జంతువుల క్రొవ్వుతో కల్తీనెయ్యిని తయారు చేశారని తెలిపారు.
ఎసిటిక్, లాక్టిక్ యాసిడ్ లను కల్తీనెయ్యికి ఉపయోగించారని సిట్ విచారణలో తేలిందని చెప్పారు. యాగం పేరుతో భూమన నాటకాలాడు తున్నాడని దుయ్యబట్టారు.
కల్తీ నెయ్యిలో 247కోట్లు దోచేశారని ఆరోపించారు.
వైసిపి నేతలు శ్రీనివాసుడి కాళ్ళ మీద పడి పాప ప్రాయశ్చితం చేసుకోవాలి.
వైసిపి నేతలు తప్పులు చేసి చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు క్షమాపణలు చెప్పమనడం విడ్డూరంగా ఉందన్నారు. దేవుడు అవకాశమిస్తే వైసిపి నేతలు అడ్డంగా దోచేశారని పేర్కొన్నారు. శ్రీవారిని రాజకీయాలకు వాడుకోవడం బాధాకరం అన్నారు. ఈ మీడియా సమావేశంలో బీజేపీ నేతలు
పొనగంటి భాస్కర్, వరప్రసాద్ కూడా పాల్గొన్నారు.
