బోయిన్ చెరువులో గుర్రపు డెక్క తొలగించేలా చర్యలు తీసుకోవాలని టిపిసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ కి వినతి.
ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ పరిధిలోని హస్మత్ పేట్ బోయిన్ చెరువులో గుర్రపు డెక్క పెరిగి దోమల సమస్యతో ఇబ్బంది పడుతున్నామని ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కాంగ్రెస్ నాయకులు దండుగుల యాదగిరి ఆధ్వర్యంలో స్థానికులు టీపీసీసీ ఉపాధ్యక్షుడు బండి రమేష్ ని కలిసి వినతి పత్రం అందజేశారు. గుర్రపు డెక్క పెరగడంతో సమీప కాలనీ లలో దోమలు విపరీతంగా పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదురుకుంటున్నారనీ బండి రమేష్ దృష్టికి తీసుకు వచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి ఫాగింగ్ తో పాటు చెరువులో గుర్రపు డెక్క తొలగించేలా చర్యలు తీసుకుంటామని బండి రమేష్ హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో లక్ష్మయ్య, ముస్తఫాలి, షహేన్షా, సలీం, సాబీర్, అస్లాం, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
