లింగమ్మ మృతికి టీఆర్‌పీ నేత జానయ్య యాదవ్ నివాళి
సూర్యాపేట జిల్లా ప్రతినిధి: సూర్యాపేట పట్టణం 9వ వార్డుకు చెందిన మేకల లింగమ్మ అనారోగ్యంతో మృతి చెందిన విషయం తెలిసిన వెంటనే తెలంగాణ రాజ్యాధికార పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి నల్గొండ జిల్లా ఇంచార్జ్ వట్టె జానయ్య యాదవ్ వారి నివాసానికి చేరుకుని పార్దివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వట్టె జానయ్య యాదవ్ మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించి, ఈ దుఃఖ సమయంలో ధైర్యంగా ఉండాలని కోరుతూ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. పార్టీ తరఫున కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పార్టీ ముఖ్య నాయకులు సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు మామిడి అంజయ్య, పట్టణ అధ్యక్షుడు కుంభం నాగరాజు, ఆత్మకూరు మండల అధ్యక్షుడు బొల్లె సైదులు, మాజీ మార్కెట్ డైరెక్టర్ మురళి, కుంభం వెంకన్న, ప్రధాన కార్యదర్శి ఏశబోయిన మల్లేష్ యాదవ్, వట్యాల శేఖర్, నెలచర్ల మధు ప్రజాపతి, గట్టు గోపి, దేశబోయిన సురేష్, కడియం వంశీ, మామిడి ఉదయ్ తదితరులు పాల్గొన్నారు. మేకల లింగమ్మ అకాల మృతి పట్టణంలో విషాదాన్ని నింపగా, వారి కుటుంబానికి పార్టీ నాయకులు, కార్యకర్తలు తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు.
