నూతన పారా లీగల్ వాలంటీర్స్ కు శిక్షణ

TEJA NEWS

నూతన పారా లీగల్ వాలంటీర్స్ కు శిక్షణ

వనపర్తి
వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యాలయంలో న్యాయవిద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. నూతనంగా ఎన్నికైన పారా లీగల్ వాలంటీర్స్ కు జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ కార్యదర్శి వి. రజని సంస్థ యొక్క పనితీరును గురించి వివరిస్తూ సంస్థ ఏవిధంగా ప్రజలకు ఉచిత న్యాయ సహాయాన్ని అందిస్తుందో వివరించారు. సంస్థ గ్రామాలలో, పాఠశాలల్లో కళాశాలలో, ప్రభుత్వ కార్యాలయాలలో మరియు మహిళా సంఘాల కార్యాలయాలలో ఏ విధంగా న్యాయ అవగాహన సదస్సులను నిర్వహించి చట్టాలపై అవగాహన కల్పిస్తుందో తెలియజేశారు. జాతీయ న్యాయ సేవ అధికార సంస్థ రూపొందించిన పథకాలను జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ అమలు పరుస్తున్న విధానాన్ని తెలియజేశారు. సామాజిక సేవలో జిల్లా న్యాయ సేవ అధికార సంస్థతో భాగస్వాములు కావడానికి పారా లీగల్ వాలంటీర్స్ గా చేరవచ్చు అని తెలిపారు కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ రఘు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top