బీజేవైఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా హరికృష్ణ
తిరుపతి: భారతీయ జనతాపార్టీ యూత్ వింగ్ లో భాగంగా భారతీయ జనతా యువమోర్చా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన ప్రధాన కార్యదర్శిగా తిరుపతికి చెందిన నాగోతు హరికృష్ణ నియామకం జరిగింది. శక్తిమంతమైన భారతీయ యువతని దేశ భవిష్యత్తుకై భాగస్వామ్యం చేస్తూ భారతదేశాన్ని సుస్థిరమైన దేశంగా, విశ్వగురువుగా మళ్ళీ నిలిపేందుకు బీజేవైఎం నిరంతరం కృషి చేస్తోంది. అటువంటి అత్యంత కీలకమైన బీజేవైఎం ఎపి ప్రధాన కార్యదర్శిగా హరికృష్ణను నియమించడంతో యువమోర్చా కార్యకర్తలు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
గతంలో నాగోతు హరికృష్ణ ఏబీవీపీ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శిగా, ఏబీవీపీ జాతీయ కార్యదర్శిగా సమర్థవంతంగా తన బాధ్యతల్ని నిర్వర్తిస్తూ అనేక విద్యార్థి ఉద్యమాలు చేసి, విద్యార్థుల సమస్యలపై పోరాడారు.
భారతీయ జనతా యువమోర్చా ప్రధానకా ర్యదర్శిగా నియమితులైన నాగోతు హరికృష్ణ మాట్లాడుతూ తనపై ఎంతో నమ్మకం ఉంచి బీజేవైఎంలో అత్యంత కీలకమైన ప్రధాన కార్యదర్శి బాధ్యతని తనకు అప్పచెప్పి భారతమాత సేవకై అవకాశం కల్పించిన బిజెపి రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ కి, బిజెపి రాష్ట్ర సంఘటన కార్యదర్శి మధుకర్ కి, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షులు సునీల్ రెడ్డి కి, బిజెపి తిరుపతి జిల్లా అధ్యక్షులు సామంచి శ్రీనివాస్ కి ధన్యవాదాలు తెలియజేశారు.
