కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బాచుపల్లి కాలనీలో శ్రీ శ్రీ ఎల్లమ్మ తల్లి 19వ వార్షికోత్సవ మహోత్సవ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించబడింది. ఆలయ కమిటీ ఆహ్వానం మేరకు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ కొలన్ హన్మంత్ రెడ్డి ముఖ్య అతిథిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆరోగ్యంగా, సమృద్ధిగా ఉండాలని ప్రార్థించారు.
ఈ కార్యక్రమంలో సీనియర్ కాంగ్రెస్ నాయకులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, కొలన్ జీవన్ రెడ్డి, కొలన్ బాల్ రెడ్డి, సిద్ధునోల సంజీవ్ రెడ్డి, వన్నీరు గణేష్, మైసిగారి శ్రీనివాస్, నరేందర్ రెడ్డితో పాటు పలువురు నాయకులు, భక్తులు పాల్గొన్నారు.
