మోదీ నాయకత్వంలో ఇది గొప్ప విజయం: లోకేశ్
- అమరావతి: భారత్తో వాణిజ్య ఒప్పందానికి అంగీకరిస్తున్నామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దీనిపై ఏపీ మంత్రి నారా లోకేశ్ స్పందించారు. ప్రధాని మోదీ నాయకత్వంలో భారత్కు ఇది గొప్ప విజయమని పేర్కొన్నారు. దూరదృష్టి నాయకత్వంతో సాధించిన కీలక ముందడుగు అని అభివర్ణించారు. సుంకాల తగ్గింపు భారత ఎగుమతులు, తయారీ రంగానికి భారీ ఊతమిచ్చే నిర్ణయమన్నారు. ఏపీ సముద్ర ఆహార ఎగుమతులు, ఎంఎస్ఎంఈలు లాభపడనున్నాయని పేర్కొన్నారు.
