టీఎస్ జెఏ సూర్యాపేట జిల్లా ప్రధమ మహాసభను జయప్రదం చేయాలి : కందుకూరి యాదగిరి
సూర్యాపేట జిల్లా : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టుల సంక్షేమం, భద్రత, హక్కుల సాధన కోసం అహర్నిశలు ఉద్యమం చేస్తూ వృత్తి నిబద్ధతతో పనిచేస్తున్న ఏకైక యూనియన్ తెలంగాణ స్టేట్ జర్నలిస్ట్ అసోసియేషన్ (TSJA) అని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, రాష్ట్ర అధ్యక్షులు కందుకూరి యాదగిరి అన్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో నిర్వహించిన కార్యక్రమంలో ఫిబ్రవరి 26న జరగనున్న TSJA సూర్యాపేట జిల్లా ప్రధమ మహాసభలకు సంబంధించిన బ్రోచర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా యాదగిరి మాట్లాడుతూ“జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించే వరకు ప్రభుత్వం మీద దఫాలవారీగా ఉద్యమాలు చేపడతాం. జర్నలిస్టుల సంక్షేమమే లక్ష్యంగా TSJA పనిచేస్తోంది.
జిల్లా వ్యాప్తంగా ఉన్న అసోసియేషన్ నాయకులు, సభ్యులు అందరూ మహాసభకు హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం ఉమ్మడి నల్గొండ జిల్లా అధ్యక్షులు దుస్స చంద్రశేఖర్ ఆధ్వర్యంలో జరిగింది. ఇందులో
రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ధూపాటి శ్యాంబాబు, రాష్ట్ర కోశాధికారి కొరివి సతీష్ యాదవ్,సూర్యాపేట జిల్లా అధ్యక్షులు గుంటి శ్రీనివాస్, జిల్లా ప్రోగ్రాం కన్వీనర్ వంశీకృష్ణ శర్మ, జిల్లా ఉపాధ్యక్షులు బచ్చలకూరి వెంకన్న, నియోజకవర్గ ఉపాధ్యక్షులు సందీప్,
సీనియర్ జర్నలిస్టులు చెరుకు శ్రీనివాస్, నామా వేణు తదితరులు పాల్గొన్నారు.
