ఐజ పట్టణానికి హీరో తనుష్.

TEJA NEWS

ఐజ పట్టణానికి హీరో తనుష్.

అలంపూర్ ;
జనసేన పార్టీ ప్రచార నిమిత్తం, అలంపూర్ తాలూకా ఐజ పట్టణానికి హీరో తనుష్ బృందం,వచ్చారు.
జనసేన పార్టీ తరపున, పవన్ కళ్యాణ్ అభిమానులు బైక్ ర్యాలీ తో స్వాగతం పలికారు.
ఐజ మున్సిపాలిటీలో 8వ వార్డు అభ్యర్థిగా జనసేన పార్టీ తరఫున పోటీ చేయుచున్న వీరేష్ కు మద్దతుగా పవన్ కళ్యాణ్ అభిమానిగా, వీరేష్ వారి స్వగృహం నందు పత్రికా సమావేశం ఏర్పాటు చేశారు.
చూపు ఉన్నవారు సమాజాన్ని పట్టించుకోకపోవడం చాలా దారుణమని, ఒక చూపు లేని వ్యక్తి సమాజాన్ని బాగు చేస్తానని ముందుకు రావడం, వీరేష్ గొప్ప మనసుకు నిదర్శమని ఈ సందర్భంగా తనుష్ అన్నారు.
పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు అనుగుణంగా, దేశవ్యాప్తంగా ఎంతో మంది అభిమానులు ముందుకు వస్తూ సేవా కార్యక్రమం లో పాల్గొంటున్నారని ఇది శుభ పరిణామం ఈ సందర్భంగా తనీష్ అన్నారు.


తనుండే ప్రాంతాన్ని ఆయన కు చూపు లేకపోయినా పరిసర ప్రాంతాల ప్రజలు సుఖసంతోషాలు చూడడం ఆయన గొప్ప మదనసకి నిదర్శనమని ఈ సందర్భంగా ఆయన అన్నారు. 8వ వార్డు ప్రజలు నిండు మనసుతో వీరేష్ ని ఆశీర్వదించి కౌన్సిలర్ గా గెలిపించాలని సందర్భంగా ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో
ఐజ జనసేన పార్టీ నాయకులు సత్యం, మున్నా, రాజేష్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top