బిజెపి తోనే అభివృద్ధి సాధ్యం
బిజెపి అభ్యర్థి బచ్చు సౌజన్య రామ్ గడప గడప ప్రచారం
వనపర్తి :
వనపర్తి మున్సిపాలిటీ పరిధి లోని 33 వార్డు వల్లబ్ నగర్ బిజెపి అభ్యర్థి బచ్చు సౌజన్య రామ్ వార్డులో గడప గడపను తిరుగుతూ చేసి ప్రజలను బిజెపి కి ఓటు వేసి గెలిపిస్తే మీ ఇంటికి వచ్చి పని చేస్తా అభివృద్ధి బిజెపితోనే సాధ్యమవుతుంది అని బిజెపి అభ్యర్థి బచ్చు సౌజన్య రామ్ వార్డు ఓటర్లను అభ్యర్థించారు కాంగ్రెస్ కళ్లిబోల్లి మాటలు నమ్మి ఓటు వేస్తే వారి ఇంటికి వెళ్లి కాంగ్రెస్కు పని చేయాలనీ గతంలో కూడా ఒకసారి అనుభవం అయిందనీ కాంగ్రెస్ వారు గేటు దగ్గర కూడా రానివ్వరు. ప్రజల యొక్క కష్టసుఖాలను తెలుసుకొని వారికి అండగా ఉంటానని దేశంలో నరేంద్ర మోడీ ప్రవేశపెట్టిన పథకాలను, దేశ అభివృద్ధిని తెలియ చేస్తూ ఇంటికి ప్రతి ఇంటికి గడప గడపకు తిరుగుతూ ప్రచారం చేయడం జరిగింది.
దేశం బాగుండాలంటే బిజెపికి ఓటు వేసి గెలిపించాలని రాబోయే కాలం భారతదేశం మొత్తం బిజెపి కమలం విశ్వసిస్తుందని కాంగ్రెస్ చేసిన మోసపూరిత కుట్రలను తిప్పి కొట్టాలని డబ్బు బలంతో ముందరికి కొస్తున్న అధికార దహనంతోనా ఆరు గారెంటీ అమ్ములు అవ్వకుండా ప్రజలను మభ్యపెట్టి మోసం చేసి ఓట్లు వేసుకోవడానికి వస్తుంది కాబట్టి ప్రజలకు తెలియజేసి వారికి నమ్మొద్దని వారి మాటలు నమ్మొద్దని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఒక్కమాట ఒక్కటి కూడా నిజం లేదు కాబట్టి బిజెపి బలపరిచిన అభ్యర్థులను కమలం పువ్వుకు ఓటేసి గెలిపించాలని కోరారు
