మార్చి నాటికి మరో 500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు జరగాలి…..
జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష…
పెద్దపల్లి//మార్చి 2026 నాటికి మరో 500 ఎకరాలలో ఆయిల్ ఫామ్ పంట సాగు జరగాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష శుక్రవారం ఆయిల్ ఫామ్ పంట సాగు పై సంబంధిత అధికారులతో రివ్యూ నిర్వహించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం పెద్దపల్లి జిల్లాలో ఇప్పటి వరకు నూతనంగా మనం 525 ఎకరాల ఆయిల్ పామ్ పంట సాగు చేశామని అన్నారు. మార్చి నాటికి మరో 500 ఎకరాల విస్తీర్ణంలో ఆయిల్ పామ్ సాగు పూర్తి చేయాలని, దీనికి తగిన విధంగా డ్రిప్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని అన్నారు.
మండలాల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకోని లక్ష్యం చేరుకోవాలని అన్నారు . 10 ఎకరాల పైగా ఉన్న ప్రతి రైతు ప్రత్యేకంగా టార్గెట్ చేయాలని అన్నారు. ప్రతి వ్యవసాయ విస్తరణ అధికారి, ఉద్యాన విస్తరణ అధికారి,ఆయిల్ ఫామ్ ఫీల్డ్ ఆఫీసర్ లు,డ్రిప్ సిబ్బంది కి లక్ష్యాలు కేటాయించాలని అన్నారు.
ఆయిల్ ఫామ్ మొక్కల తో పాటు, డ్రిప్ ఏర్పాటుకు కూడా రైతుల నుంచి డీడీలు తీసుకోవాలని కలెక్టర్ తెలిపారు. ఆయిల్ పామ్ సాగుతో వచ్చే ఆదాయం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలని అన్నారు.
ఆయిల్ పామ్ సాగు మొక్కలు నాటిన తర్వాత డ్రిప్ ఏర్పాటు ఆలస్యం కాకుండా చూడాలని అన్నారు. డ్రిప్ ఇరిగేషన్ వ్యవస్థ ఏర్పాటు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. ఆయిల్ పామ్ ప్లాంటేషన్ తో పాటు డ్రిప్ ఏర్పాటుకు సమాంతరంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అధికారులకు తెలిపారు.
ఈ సమావేశంలో జిల్లా ఉద్యానవన శాఖ అధికారి జగన్మోహన్ రెడ్డి, హార్టికల్చర్ అధికారులు మహేష్, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
