41వ. డివిజన్ సిపిఐ అభ్యర్థి మార్కాపురి సూర్యను అత్యధిక మెజార్టీతో గెలిపించండి….
సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే కామ్రేడ్ చాడ వెంకటరెడ్డి…
పెద్దపల్లి/ ;. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ 41వ డివిజన్ కార్పొరేటర్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మార్కాపూర్ సూర్యకు మద్దతుగా వందలాదిమంది తో డివిజన్లో భారీ ర్యాలీ డప్పు చప్పులతో ఎల్బీనగర్ లోని సిపిఐ జెండా చేరుకొని అక్కడ భారీ సభ నిర్వహించడం జరిగింది.
ఈ సభకు ముఖ్యఅతిథిగా సిపిఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడా వెంకటరెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు కలవైన శంకర్ హాజరై మాట్లాడుతూ, ఉజ్వల చరిత్ర కలిగిన భారత కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న సిపిఐ తిరుపతి కుమారుడు మార్కాపూర్ సూర్య ని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని వారు డివిజన్ ప్రజలను కోరారు.
విద్యావంతుడు యువకుడు విద్యార్థి యువజన నాయకుడిగా ఎదిగి కమ్యూనిస్టు పార్టీలో ఫుల్ టైం గా పని చేస్తున్న సూర్యను గెలిపిస్తే డివిజన్లో ఒక రక్షకుడిగా ఉంటూ, డివిజన్ ప్రజలకు అందుబాటులో ఉంటాడని తెలిపారు. గతంలో సిపిఐ తిరుపతి కౌన్సిలర్ గా గెలిచి 19వ. వార్డును అనేక రకాలుగా అభివృద్ధి చేయడం జరిగిందని, కమ్యూనిస్టు పార్టీ గెలిస్తే అభివృద్ధి జరుగుతుందని, ఇతర బూర్జో పార్టీ లాగా స్వార్థానికి కాకుండా ప్రజల కోసం పనిచేసే ప్రజాప్రతినిధులు కేవలం కమ్యూనిస్టు పార్టీ ప్రజా ప్రతినిధులు మాత్రమేనని, కాబట్టి డివిజన్ ప్రజలంతా కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థి అయిన మార్కపురి సూర్య ని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.
రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు ప్రజా ఆమోదయోగ్యమైన పనులు చేయడంలో విఫలమయ్యారని కమ్యూనిస్టు పార్టీని ఎన్నికల దగ్గర తీసి ఎన్నికల అనంతరం అధికార బలంతో,అధికార అహంతో దూరం పెట్టడం వల్ల రేపు ఎన్నికల్లో వాళ్ళ తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గౌతమ్ గోవర్ధన్, గోశిక మోహన్, జిల్లా కార్యవర్గ సభ్యులు మడ్డి ఎలా గౌడ్, పార్టీ ప్రజాసంఘాల నాయకులు శనగరపు చంద్రశేఖర్, అబ్దుల్ కరీం, శనిగరపు తిరుమల, కర్ణం లక్ష్మీనారాయణ, ఎజ్జ రాజయ్య, రణవిని సుధీర్ కుమార్, డప్పురాజు, జూలమోహన్, తదితరులు పాల్గొన్నారు.
