11న.మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిoచడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలి…

TEJA NEWS

11న.మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిoచడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలి…

అదనపు కలెక్టర్ రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ…

పెద్దపల్లి/ ; ఫిబ్రవరి 11న. మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహిoచడానికి పోలింగ్ సిబ్బంది సహకరించాలని అదనపు కలెక్టర్ ( స్థానిక సంస్థలు ) , రామగుండం నగర పాలక సంస్థ కమిషనర్ జె. అరుణ శ్రీ కోరారు. ఎన్ టి పి సి ,పి టి ఎస్ కాకతీయ కళ్యాణ మండపంలో ప్రిసైడింగ్ అధికారులకు , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులకు రెండవ విడత శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఓటర్లు,అభ్యర్థులు,ఏజెంట్లు ,సిబ్బంది అందరినీ సమన్వయం చేసుకుంటూ పోలింగ్ సాఫీగా జరిగేలా ప్రిసైడింగ్ అధికారులు చూడాలని,పోలింగ్ కేంద్రంలో ప్రిసైడింగ్ అధికారులు , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులతో పాటు ఇతర సహాయక సిబ్బంది కూడా ఉంటారని అన్నారు.

ఓటరు ఒరిజినల్ గుర్తింపు కార్డు పరిశీలించిన తరువాతనే ఓటు వేయడానికి అనుమతించాలని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రంలో వెబ్ కాస్టింగ్ కు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ సందర్భంగా శిక్షకులు కేడం శ్రీనివాస్ , జె. శ్రీనివాస్ లు పోలింగ్ రోజు ప్రిసైడింగ్ అధికారులు , అసిస్టెంట్ ప్రిసైడింగ్ అధికారులు నిర్వర్తించాల్సిన విధుల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ డిప్యూటీ కమిషనర్ నాయిని వెంకట స్వామి, అసిస్టెంట్ కమిషనర్ వెంకటేశ్వర్లు, రెవెన్యూ ఆఫీసర్ ఆంజనేయులు, సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శంకర్ రావు తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top