కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం

TEJA NEWS

కేంద్ర ప్రభుత్వం తెచ్చిన 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని, ఫిబ్రవరి 12న జరిగే దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని సిఐటియు బాచుపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో…

అలీఫ్ ఇండస్ట్రియల్ ఏరియా లో CITU ఆధ్వర్యంలో ఇండస్ట్రియల్ లో పనిచేసే కార్మికులకు కరపత్రాలు పంచడం జరిగింది….

ఈ సందర్భంగా సిఐటియు బాచుపల్లి మండల కార్యదర్శి రాథోడ్ సంతోష్ మాట్లాడుతూ…..కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం కార్మిక సంఘాలు, కార్మిక చట్టాలు లేని దేశంగా మార్చాలని, కార్మికుల్ని నిరాయుధులను చేసి పెట్టుబడిదారులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్లకు బంగారు పళ్ళెంలో పెట్టి బహుమానం ఇచ్చేందుకు సిద్ధమైంది. అందులో భాగంగానే వీరోచితంగా పోరాడి ప్రాణ త్యాగాలతో సాధించుకున్న 29 కార్మిక చట్టాలను రద్దు చేసింది. వాటి స్థానంలో 4 లేబర్ కోడ్లను 6 సం”ల క్రితం (2019, 2020 సం” లలో తెచ్చింది. వీటికి వ్యతిరేకంగా కార్మికవర్గం పోరాడిన ఫలితంగా ఇంతకాలం వాటిని అమలు చేయకుండా ఆపగలిగాము, కానీ నేడు మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ అమలుతో కార్పొరేట్ సంస్థల సులభతర వ్యాపారానికి ద్వారాలు తెరిచింది. కార్పొరేట్ల ప్రయోజనాలు, వారి లాభాలు పెంచేందుకే 2025 నవంబర్ 21న లేబర్ కోడ్స్ అమలుకు నోటిఫికేషన్ జారీ చేసింది.2025 శీతాకాల పార్లమెంట్ సమావేశాలు ముగిసే సమయంలో హడావుడిగా మోడీ ప్రభుత్వం లేబర్ కోడ్స్ నోటిఫై చేసింది.

గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని రద్దు చేసి విబి జి-రామ్ జీ స్కీమ్ను తెచ్చి రాష్ట్రాల పై ఆర్థిక భారం మోపింది. విద్యుత్ సవరణ బిల్లు-2025, విత్తన సవరణ చట్టం, ఇన్సూరెన్స్ రంగంలో 100 శాతం విదేశీ పెట్టుబడులకు అనుమతి లాంటి మరిన్ని వినాశకరమైన చట్టాలను, బిల్లులను తీసుకొచ్చి శ్రమజీవులపై దాడి చేసింది. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విస్తారంగా ఉన్న శ్రామిక వర్గాలను చావు దెబ్బ కొట్టింది.కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ల అమలుతో 40 కోట్ల సంఘటిత, అసంఘటిత కార్మికులు, వారి కుటుంబాలు చితికిపొయ్యేలా, కార్పొరేట్లు లాభాలు ప్రోగేసుకోడానికి మార్గం సుగమం చేసింది అన్నారు..
బాచుపల్లి మండలంలోని కార్మికులు, ఉద్యోగులు,ప్రజలు, ప్రజాతంత్రవాదులు, ప్రజా సంఘాలు ఈ సమ్మెకు సంపూర్ణ మద్దతు ఇవ్వాలని కోరుతున్నాము. ఈ కార్యక్రమంలో సిఐటియు నాయకులు పెంటయ్య, లక్ష్మి, రాములు, పి.నరసింహ, నారాయణ, సునీత, అలివేలు,పి.స్వామి,మనీ, తదితరులు పాల్గొన్నారు….

You cannot copy content of this page

Scroll to Top