మచ్చాపూర్ పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో పాల్గొని తల్లి ఆశీర్వాదాన్ని అందుకున్న మంత్రి సీతక్క …
పోచమ్మ తల్లి గుడికి పది వేల రూపాయలు విరాళంగా అందించారు…అలాగే పోచమ్మ తల్లి దేవాలయం చుట్టూ ప్రహరి గోడ నిర్మిస్తానని, మంచి నీటి బోర్ వేయిస్తానని, దేవాలయానికి వెళ్ళే దారి సీసీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు…
అలాగే మచ్చాపూర్ గ్రామంలో ప్రధాన సమస్య భూదాన్ భూముల సమస్య అని, అట్టి సమస్యను త్వరలో పరిష్కరిస్తా అని మచ్చాపూర్ ప్రజలకు హామీ ఇచ్చారు.. గోవిందరావుపేట మండల మచ్చాపూర్ గ్రామం నందు గ్రామ సర్పంచ్ జంపాల ప్రభాకర్ ఆధ్వర్యంలో జరిగే పోచమ్మ తల్లి విగ్రహావిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖా మాత్యులు శ్రీమతి దనసరి అనసూయ సీతక్క విచ్చేసి తల్లి యొక్క ఆశీర్వాదం గ్రామ ప్రజలందరిపై ఉండాలని కోరారు.
ఈ సందర్భంగా సీతక్క మాట్లాడుతూ పోచమ్మ తల్లి దేవాలయం చుట్టూ ప్రహరి గోడ నిర్మిస్తానని, తల్లిని దర్శించే భక్తుల కోసం మంచినీటి బోర్ వేయిస్తానని, గుడికి వెళ్ళే దారి సీసీ రోడ్డు వేయిస్తానని హామీ ఇచ్చారు. అలాగే పోచమ్మ తల్లి దేవాలయానికి పది వేల రూపాయలు విరాళంగా ఇచ్చారు. అలాగే మచ్చాపూర్ గ్రామంలో ప్రధాన సమస్య భూదాన్ సమస్య అని, ఆ సమస్య వల్ల గ్రామ ప్రజలు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, తొందర్లోనే కలెక్టర్ తో మాట్లాడి భూదాన్ భూముల సమస్యను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, కిసాన్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు గొల్లపల్లి రాజేందర్ గౌడ్, మండల అధ్యక్షులు పాలడుగు వెంకటకృష్ణ తో పాటుగా గోవిందరావుపేట మండల కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర, జిల్లా, మండల, గ్రామ నాయకులు, ప్రజా ప్రతినిధులు, యూత్ నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు అందరూ పాల్గొన్నారు.
