ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, శాంతిని పెంపొందిస్తాయి – బిఆర్ఎస్ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్

TEJA NEWS

ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, శాంతిని పెంపొందిస్తాయి – బిఆర్ఎస్ఎల్పీ విప్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ..

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం 132 జీడిమెట్ల డివిజన్ పరిధి సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్‌లో ఉన్న సోనాబన్ మోహన్ అపార్ట్‌మెంట్‌లో నిర్వహించిన శ్రీ గణపతి ఆలయం రెండవ వార్షికోత్సవ వేడుకలకు బిఆర్ఎస్ ఎల్పీ విప్, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించి, భక్తుల శ్రేయస్సు కోసం ప్రార్థనలు చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, గణపతి స్వామి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఐశ్వర్యవంతమైన జీవితాలు గడపాలని ఆకాంక్షించారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు సమాజంలో ఐక్యతను, శాంతిని పెంపొందిస్తాయని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ సురేష్ రెడ్డి , కాలనీ సంక్షేమ సంఘం సభ్యులు కోరే ఆనంద్, కె. రాయప్ప రెడ్డి, కిరణ్ కుమార్, వెంకటేష్, RL రావు, మధుసూదన్ రావు, శ్రీధర్, నర్సింహా రెడ్డి, స్థానిక నాయకులు సంపత్ మాధవ్ రెడ్డి, కుంటా సిద్దిరాములు, గుమ్మడి మధుసూదన్, జ్ఞానేశ్వర్ ముదిరాజ్, నరేందర్ రెడ్డి, సమ్మయ్య నేత, నదీమ్ రాయ్, కాలే గణేష్, బాల మల్లేష్, కుంటి మల్లేష్, రాములు యాదవ్, డివిజన్ అధ్యక్షులు పోలే శ్రీకాంత్, పుప్పాల భాస్కర్, రుద్రా అశోక్, అపార్ట్‌మెంట్ వాసులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top