కట్కూరి పృథ్వీ – ప్రణతి వివాహ మహోత్సవంలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే నాగరాజు …
హన్మకొండ జిల్లా మడికొండలోని రెడ్డి కన్వెన్షన్ హాల్‌లో కాంగ్రెస్ నాయకులు కట్కూరి స్వామి కుమారుడు కట్కూరి పృథ్వీ – ప్రణతి ల వివాహ మహోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ శుభకార్యానికి మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి , వర్ధన్నపేట నియోజకవర్గ ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు , జిల్లా యూత్ అధ్యక్షుడు కేఆర్ దిలీప్ రాజ్ హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు..
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు మాట్లాడుతూ, “కట్కూరి స్వామి నేను ఒక తల్లి కడుపున పుట్టకపోయినా అన్నదమ్ముల్లా ఎంతో సన్నిహితంగా ఉంటాము. వారి కుటుంబంలో జరుగుతున్న ఈ శుభకార్యానికి హాజరుకావడం ఆనందంగా ఉంది. ఈ వివాహానికి విచ్చేసిన ప్రతి ఒక్కరూ నూతన వధూవరులను నిండు మనసుతో ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను” అని తెలిపారు..
ఈ కార్యక్రమంలో వర్ధన్నపేట నియోజకవర్గ అధికార ప్రతినిధి నిమ్మాని శేఖర్ రావు , పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొన్నారు….
