రామాంతపూర్ డివిజన్ ఇంద్రానగర్ చిన్న చెరువు కు నిధులు మంజూరు చేయాలనీ హైడ్రా కమీషనర్ రంగనాధ్ ని కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మా రెడ్డి
రామంతాపూర్ డివిజన్ ఇంద్రానగర్ చిన్న చెరువు సమస్యలు ముఖ్యముగా పూడిక తీయటం ,చెరువు చుట్టూ ఉన్న వ్యర్దాలను తొలగించటం ,అలాగే ఫెన్సింగ్ వెయ్యాలని , బ్యూటీఫికేషన్ చెయ్యాలని ,పబ్లిక్ కి వాకింగ్ ట్రాక్ ఏర్పాటు చేయాలనీ ,ఈ సమస్యలపై ఎమ్మెల్యే హైడ్రా కమీషనర్ రంగనాధ్ కి వినతి పత్రం ఇవ్వటం జరిగింది
సానుకూలంగా స్పందించిన కమీషనర్ సాధ్యమైనంత త్వరగా నిధులు సమకూరేలా ఏర్పాటు చేస్తాం అన్నారు
మెయిన్ రోడ్ రామంతాపూర్ చెరువు సుందరీకరణ కోసం రూ.19 కోట్లు మంజూరు చేసినందుకు కమీషనర్ కి ఎమ్మెల్యే ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు …
ఈ కార్యక్రం లో బిఆర్ఎస్ నాయకులు గంథం నాగేశ్వరావు, సురం శంకర్, చాంద్ పాషా ,ఆపిల్ శ్రీను ,మారుతీ ,ప్రేమ్ ,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు …
