ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్‌కు హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే

TEJA NEWS

ఫ్రెండ్స్ క్రికెట్ క్లబ్ టోర్నమెంట్‌కు హాజరైన ఉప్పల్ ఎమ్మెల్యే

Babu Rao Garden Kachivan Singaram లో షరీఫ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న Friends Cricket Club Tournament Uppal – Season 1 కార్యక్రమానికి బండారి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, యువత క్రీడల్లో ముందుండాలని, క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు క్రమశిక్షణను, జట్టు భావాన్ని పెంపొందిస్తాయని అన్నారు. ఇలాంటి టోర్నమెంట్లు యువ క్రీడాకారులకు ప్రోత్సాహం కలిగించి, వారి ప్రతిభను వెలికితీసే వేదికలుగా నిలుస్తాయని పేర్కొన్నారు.

క్రీడా రంగ అభివృద్ధికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చిన ఎమ్మెల్యే , టోర్నమెంట్‌ను విజయవంతంగా నిర్వహిస్తున్న నిర్వాహకులను అభినందించారు.

ఈ కార్యక్రమంలో క్రీడాకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top