దేశంలోనే మొదటి శివాలయం దర్శనం

TEJA NEWS

దేశంలోనే మొదటి శివాలయం దర్శనం

** వైసీపీ మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్

తిరుపతి / ఏర్పేడు: భారతదేశంలోనే మొట్టమొదటి శివాలయం అయిన శ్రీకాళహస్తి సమీపంలోని ఏర్పేడు మండలం గుడిమల్లం గ్రామం లో శ్రీ ఆనందవల్లి సమేత శ్రీ పరుశురామేశ్వర స్వామి వారిని శ్రీకాళహస్తి మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి, శ్రీకాళహస్తి దేవస్థానం ధర్మకర్తలిమండలి మాజీ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు దర్శించుకున్నారు. వారికి దర్శన ఏర్పాట్లతో గుడిమల్లం దేవస్థానం మాజీ చైర్మన్ నరసింహ యాదవ్, వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులు, ఏర్పేడు మండల అధ్యక్షులు రమణయ్య యాదవ్, గున్నేరు కిషోర్ రెడ్డి, చంద్ర, రాజశేఖర్, శ్రీవారి సురేష్, ఉత్తరాది శరవన్ కుమార్, సాధన మున్నా రాయల్, బుల్లెట్ జయశ్యం, సుధీర్, తదితరులు స్వాగతం పలికి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top