గుడిమల్లం ఆలయ “గిరిప్రదక్షిణ”కు తరలిరండి

TEJA NEWS

గుడిమల్లం ఆలయ “గిరిప్రదక్షిణ”కు తరలిరండి

** టీడీపీ అధ్యక్షులు “పేరం” పిలుపు

తిరుపతి / ఏర్పేడు: తిరుపతి జిల్లా ఏర్పేడు మండలంలోని గుడిమల్లం పరశురామేశ్వర స్వామి, అమ్మవార్ల గిరి ప్రదక్షిణ కార్యక్రమం మంగళవారం ఉదయం 8 గంటలకు ప్రారంభం అవుతుందని ఏర్పేడు మండల టిడిపి అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు తెలిపారు. ఈ గిరి ప్రదక్షిణ కార్యక్రమం గుడిమల్లం నుంచి ప్రారంభమై మిట్టమీద కండ్రిగ, పెనుమల్లం, పాపానాయుడు పేట, మర్రి మంద, వికృతమాల, గోవిందవరంలో మధ్యాహ్నం ఏర్పేడు మండల అధ్యక్షులు పేరం నాగరాజు నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించ బడుతుంది. తద్వారా మునగలపాలెం, మూలకండ్రిగ, ఎం.డి పుత్తూరు, రాజుల కండ్రిగ మీదుగా పాయల్ సెంటర్, చెల్లూరు, గుల్లకండ్రిగ మీదుగా గుడిమల్లం చేరుతుందని అన్నారు. కావున ఎన్డీఏ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మధ్యాహ్నం 12 గంటలకు గోవిందవరం గ్రామంలో జరిగే అన్నదాన కార్యక్రమంలో పాల్గొనాలని నాగరాజు నాయుడు విజ్ఞప్తి చేశారు.

You cannot copy content of this page

Scroll to Top