పుంగనూరు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

TEJA NEWS

పుంగనూరు లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ

తిరుపతి / అమరావతి: అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గం లబ్ధిదారులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, పుంగనూరు తెలుగుదేశం పార్టీ ఇంచార్జి చల్లా బాబురెడ్డిలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఈమేరకు
అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర రవాణా, యువజన, క్రీడాశాఖల మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి చాంబర్‌లో అన్నమయ్య జిల్లా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన ఆరుగురు లబ్ధిదారులకు సీఎం సహానిధి చెక్కులను మంత్రి పంపిణీ చేశారు.
వివిధ వైద్య కారణాలతో ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందిన బాధిత కుటుంబాలకు ప్రభుత్వం సీఎం సహానిధి ద్వారా ఆర్థిక సహాయం అందిస్తోందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. ప్రజల కష్టసుఖాల్లో ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు.

You cannot copy content of this page

Scroll to Top