స్విమ్స్ పరిశోధక విద్యార్ధికి డాక్టరేట్ ప్రధానం
తిరుపతి: శ్రీ వేంకటేశ్వర వైద్య విజ్ఞాన సంస్థ (స్విమ్స్) మెడికల్ యూనివర్సిటీ ఫిజియోథెరపి విభాగంలో పరిశోధనలు నిర్వహించిన విద్యార్థి డా.శ్రీకాంత్ అరుగ కి డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ (పి.హెచ్.డి) పట్టాను ప్రధానం చేసినట్లు స్విమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ డా. రామ్ తెలిపారు. పరిశోధక విద్యార్థి డా.శ్రీకాంత్ అరుగకి ఫ్యాకల్టీ ఆఫ్ ఫిజియోథెరపి విభాగంలో “ఎఫక్టివ్నెస్ అఫ్ ప్లైయోమెట్రిక్స్ వర్సెస్ రెసిస్టన్స్ ట్రైనింగ్ యుజింగ్ మల్టీజిమ్ ఆన్ ది స్ట్రెంత్ అఫ్ లోయర్ లింబ్ ముస్క్యూలేచర్, జంప్ పెర్ఫార్మన్స్, అజిలిటీ అండ్ బ్యాలన్స్ అమాంగ్ రీక్రియేషనల్ వాలీబాల్ ప్లేయర్స్” అనే అంశంపై పరిశోధనను నిర్వహించారు. చీఫ్ గైడ్ కమ్ అసోసియేట్ ప్రొఫెసర్ డా.ఎ.విశ్వనాథ్ రెడ్డి పర్యవేక్షణలో విద్యార్థి డా॥ శ్రీకాంత్ అరుగ సమర్పించిన ఈ గ్రంథాన్ని యూనివర్సిటి బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్ వారు పరిశీలించి పి.హెచ్.డి. డిగ్రీ ప్రధానం చేసినట్లు కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ డా.శిల్పా కడియాల అధికారికంగా ప్రకటించారు. ఈ సందర్భంగా పరిశోధక విద్యార్థి డా.శ్రీకాంత్ కు స్విమ్స్ డైరెక్టర్ డా. ఆర్.వి.కుమార్, డీన్ డా. అలోక్ సచన్, ఆర్.ఎం.ఓ. డా. వెంకట కోటిరెడ్డి, వివిధ విభాగాధిపతులు, సిబ్బంది, విద్యార్ధినీ విద్యార్ధులు, అభినందనలు తెలిపారు.
