సాహసానికి మారు పేరు ఛత్రపతి శివాజీ…
-నగర మేయర్ మహంకాళి స్వామి…
పెద్దపల్లి //గోదావరిఖని . సాహసానికి మారు పేరు ఛత్రపతి శివాజీ అని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి కొనియాడారు . ఛత్రపతి శివాజీ జయంతి పురస్కరించుకొని గురువారం జి.ఎం. కార్యాలయం వద్ద గల ఆయన విగ్రహానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ… మొఘల్ సామ్రాజ్యాన్ని ఎదిరించి దేశంలో మరాఠా సామ్రాజ్యాన్ని నెలకొల్పిన యోధుడు ఛత్రపతి శివాజీ అని అన్నారు. ఆయన అవలంభించిన ధర్మ నిరతి , సర్వ మత సమ భావన ఆయన చూపిన బాట తరతరాలకు స్ఫూర్తి దాయకమని అన్నారు.
ఈ కార్యక్రమం లో కార్పొరేటర్లు ముస్తఫా , గట్ల రమేష్ , దాసరి సాంబమూర్తి , కొలని కవిత , చిదురాల నాగ రాజు , కౌటం సతీష్ , నాయకులు వేగోళపు శ్రీనివాస్ , ఆరే కుల సంఘం నాయకులు సమ్మారావు , ఇతర ప్రతినిధులతో పాటు మీనేష్ తదితరులు పాల్గొన్నారు.
