ఆర్చ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ని కలిసిన బ్రహ్మకుమారిలు

TEJA NEWS

ఆర్చ్ నిర్మాణం కోసం ఎమ్మెల్యే ని కలిసిన బ్రహ్మకుమారిలు

వనపర్తి
వనపర్తి పట్టణంలోని బ్రహ్మకుమారి కేంద్రం సమీపంలో
ఆర్చ్ నిర్మాణం అనుమతి కోసం నిర్వాహకులు బికే నాగమణి, బికే శోభ ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డిని కలిశారు. ఈ సందర్భంగా వారు ఎమ్మెల్యే తో మాట్లాడుతూ శ్వేతా నగర్ కు వెళ్లే రోడ్డుపై దాత సహాయంతో ఆర్చి నిర్మాణం చేపట్టనున్నట్లు ఎమ్మెల్యేకు వివరించారు. అలాగే పెబ్బేరు పట్టణంలో ఈశ్వరీయ బ్రహ్మకుమారి సేవా కేంద్రం నిర్మాణానికి స్థలం కేటాయించాలని కోరారు. అందుకు ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించి వెంటనే మీ వినుతులు పరిష్కారం అయ్యేటట్లు చేస్తానని హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే సానుకూలంగా స్పందించడం పట్ల బ్రహ్మకుమారిస్ హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ జర్నలిస్ట్ గంధం భక్తరాజ్, రిటైర్డ్ తాసిల్దార్ భాస్కర్ రెడ్డి, రిటైర్డ్ టీచర్ నరసింహ, ధర్మారెడ్డి పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top