మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు ల లో పెండింగ్ లొ వున్నా కేసుల పరిష్కారం కొరకు ప్రేత్యేక డ్రైవ్

TEJA NEWS

మధ్యవర్తిత్వం ద్వారా కోర్టు ల లో పెండింగ్ లొ వున్నా కేసుల పరిష్కారం కొరకు ప్రేత్యేక డ్రైవ్.

వనపర్తి
జాతీయ న్యాయ సేవా అధికార సంస్థ, న్యూ ఢిల్లీ దేశంలో ఉన్న స్థాయిలో వున్నా అన్ని కోర్టు లలో పెండింగ్ లొ వున్నా కేసుల పరిష్కారం కొరకు మధ్యవర్తిత్వ ప్రేత్యేక నియమావాలళిని రూపొందించి 02.01.2026 నుంచి మొదలుకొని 31.03.2026 వరకు 90 రోజుల పాటు ప్రేత్యేక మధ్యవర్తిత్వ డ్రైవ్ ని నిర్వహించమని అన్ని రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థలను ఆదేశించటం జరిగిందని ఆ ఆదేశాల మేరకు రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ, తెలంగాణ రాష్ట్రం, మరియు మీడియేషన్ కన్సిలియేషన్ ప్రాజెక్ట్ కమిటీ, హైకోర్టు, రాష్ట్ర వ్యాప్తంగా వున్న అన్ని జిల్లా న్యాయ సేవా అధికార సంస్థలను మరియు మండల న్యాయ సేవా సమితులను మధ్యవర్తిత్వ ప్రేత్యేక డ్రైవ్ ని 02.01.2026 నుండి 31.03.2026 వరకు నిర్వహించమని ఆదేశించటం జరిగిందని వారి ఆదేశాల మేరకు జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ, వనపర్తి కోర్టులలో పెండింగ్ లొ వున్నా కేసులను విభాగల వారీగా విభజించి వాటిలో మధ్యవర్తిత్వం కి అనుకూలంగా వున్నా 346 కేసులను గుర్తించడం జరిగిందని శ్రీమతి ఎం. ఆర్. సునీత, జిల్లా ప్రధాన న్యాయమూర్తి మరియు ఛైర్ పర్సన్ జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వనపర్తి గారు తెలియజేశారు.
మధ్యవర్తిత్వం అనేది ఇరుపక్షాలు వారి కేసులను సామరస్యంగా పరిష్కరించుకోవటానికి మరియు వేగమంతమైన తక్కువ ఖర్చుతో కూడుకున్నదని, ఇందులో ఇరు వర్గాలకు విజయం వర్తిస్తుందని డాక్యుమెంట్స్ సుదీర్ఘ కోర్టు పోరాటాలు ఉండవని ఇరువర్గాలు మాత్రమే మాట్లాడుతారు కానీ వారి ప్రతినిధులు కారని, ఇరు పార్టీల సమ్మతితోనే పరిష్కారం జరుగుతుందని తెలియజేశారు.

ఈ 90 రోజుల ప్రణాళికలొ భాగంగా గుర్తించబడిన కేసులలో ఇరువర్గాలకు నోటీసులని పంపించి మధ్యవర్తిత్తుల ఎదుట హాజరు కమ్మని తెలియజేయడం జరుగుతుందని, కావున కక్షిదారులు ఈ మధ్యవర్తిత్వ ప్రత్యేక డ్రైవ్ ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. మధ్యవర్తిత్వం ద్వారా ఆమోదయోగయోగ్యమైన పరిష్కారానికి ఇరువర్గాలు అంగీకరించినట్లయితే ఆ సమ్మతిని రాతపూర్వకంగా రాసి సంబంధించిన కోర్టుకి పంపించి అక్కడ తీర్పు ఇచ్చే విధంగా జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వనపర్తి ప్రయత్నం చేస్తుందని, దాని ద్వారా కోర్టులలో ఉన్న కేసులు త్వరగా పరిష్కారం అవుతాయని తెలియజేశారు.

ఈమధ్యవర్తిత్వము జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ వనపర్తి ఆధ్వర్యంలో జరుగుతుందని, వీటిలో వైవాహిక వివాదాలు, వినియోగదారుల వివాదాలు, ఆస్తి విభజన వివాదాలు, భూమికి సంబంధించిన వివాదాలు, కుటుంబ వివాదాలు, రాజీకి పరిష్కార యోగ్యమైన క్రిమినల్ కేసులు పరిష్కరించుకోవచ్చునని తెలియజేశారు. ఈ విధంగా మధ్యవర్తిట్యం ద్వారా పరిష్కరించుకున్నట్లయితే, ఎలాంటి కోర్టు ఖర్చులు ఉండదని అందరికీ ఆమోదంగా త్వరితగతిన కేసులు పరిష్కారం అవుతాయని తెలియజేశారు.

You cannot copy content of this page

Scroll to Top