జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో మినీ సమావేశం.

TEJA NEWS

జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో మినీ సమావేశం….

పెద్దపల్లి జిల్లాల వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ ఆధ్వర్యంలో, పెద్దపల్లి జిల్లా అధికారుల కార్యాలయ సముదాయ భవనము లోని (ఐడిఓసి) మినీ సమావేశం మందిరంలో ఆరోగ్య శాఖ లో కొత్తగా ల్యాబ్ టెక్నీషియన్ ఉద్యోగం పొందిన వారికి ఇండక్షన్ ట్రైనింగ్ నిర్వహించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో వివిధ జాతీయ ఆరోగ్య కార్యక్రమాలకు సంబంధించిన డయాగ్నొసిస్ పరీక్షలను నిర్వాహించే విధానం, రికార్డ్స్ నిర్వహణ, నాణ్యతా యుత రిపోర్టులు పొందే లాగా రక్త పరీక్షలు నిర్వహించే విధానం, రక్త నమూనాలను సరిగా సేకరించడం, వాటిని సరైన విధంగా తెలంగాణ డయాగ్నొస్టిక్ కేంద్రం కు పంపించే విధానం గురించే శిక్షణ అందించారు.

శిక్షణలో ముఖ్యంగా ల్యాబ్ టెక్నీషియన్‌లు, రికార్డ్స్ మెయింటెనెన్స్, రక్త నమూనాల సేకరణ తదితర అంశాలలో నైపుణ్యాలు పెంపొందించడానికి గైడ్ చేయడమైంది.

డాక్టర్ కె.ప్రమోద్ కుమార్ మాట్లాడుతూ, ల్యాబ్ టెక్నీషియన్‌లు పౌరుల ఆరోగ్య భద్రతకు కీలక పాత్ర పోషిస్తారని, వారి నైపుణ్యాలు క్వాలిటీ రిపోర్టుల ప్రాప్తికి దోహదం చేయవలసిన అవసరం ఉందని వివరించారు.

ఈ శిక్షణ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారితో పాటు, ప్రోగ్రాం అధికారి డాక్టర్ బి.రాజమౌళి, డాక్టర్ బి. కిరణ్ కుమార్, ఉమా మహేశ్వర్ ఇంచార్జీ ఏ ఎం ఓ, సీనియర్ ల్యాబ్ టెక్నీషియన్ శ్రీనివాస్, ఇతర ల్యాబ్ టెక్నీషియన్లు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top