స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన అంశం

TEJA NEWS

స్వచ్ఛ ఆంధ్రా స్వర్ణ ఆంధ్రా కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి నెలలో ఇచ్చిన అంశం జీరో లిట్టర్ గవర్నెన్స్, అనగా చెత్త రహిత గ్రామంగా గ్రామాన్ని తీర్చి దిద్దే దిశగా గ్రామ పరిపాలన చెయ్యటం.
A. కొండూరు మండలం చీమలపాడు సచివాలయం వద్ద జిల్లా కలెక్టర్ సార్ జీ లక్ష్మీశ ముఖ్య అతిథిగా పాల్గొని సచివాలయ ప్రాంగణం లో మొక్కలు నాటి, విద్యార్ధులతో ప్లాస్టిక్ వాడకం నిషిద్ధం అంటూ చేసిన ర్యాలీలో పాల్గొన్నారు.

గ్రామ హరిత రాయబారులను సత్కరించి బియ్యం, నిత్యావసర సరుకులు బహుకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీమతి పి. లావణ్య కుమారి మాట్లాడుతూ ప్లాస్టిక్ వాడకం పూర్తిగా ప్రతి వ్యక్తి వాడకం తగ్గించి పేపర్ లేదా గుడ్డ సంచి వాడాలని , ప్రతి ఇంటిలో తడి పొడి చెత్తను వేరు చేసి ఇస్తే ఆ తడి చెత్త తో వాన పాము ఎరువు తయారు చేసి రైతులకు విక్రయించి , ప్లాస్టిక్ వస్తువులు స్వచ్ఛ రథం ద్వారా గ్రామ గ్రామాల్లో సేకరించి, ఆ ఆ సొమ్ము కు సమానమైన కిరాణా సరుకులు ఇస్తామని తెలియచేసారు, ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఎం నాగలక్ష్మి,డివిజనల్ డెవలప్మెంట్ అధికారి శ్రీమతి వెంకట రమణ, మండల పరిషత్ అధికారులు బొజ్జగాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు

You cannot copy content of this page

Scroll to Top