విద్యాసాగర్ హెడ్ కానిస్టేబుల్స్ గా ఉద్యోగోన్నతి…..*
కోదాడ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ నందు కానిస్టేబుల్స్ గా పని చేస్తున్న కె.విద్యాసాగర్ హెడ్ కానిస్టేబుల్స్ గా పదోన్నతి పొందారు. ఈమేరకు జిల్లా పోలీసు కార్యాలయం నందు జిల్లా ఎస్పి నరసింహ ఐపిఎస్ ప్రమోషన్ పొందిన హెడ్ కానిస్టేబుల్ ను ప్రమోషన్ ఉత్తర్వులు అందజేసి, మిఠాయిలు పంచి శుభాకాంక్షలు తెలిపినారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఉద్యోగోన్నతి తో పాటుగా బాధ్యతలు పెరుగుతాయని బాధ్యతలు కు అనుగుణంగా విధుల నిర్వహణలో అప్రమత్తంగా ఉండి ప్రజలకు ఉత్తమ సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలని, పోలీస్ శాఖకు మంచి పేరు తేవాలని ఎస్పీ కోరినారు. క్రమశిక్షణతో మెలగాలని, తోటి సిబ్బందిని గౌరవించాలని సమన్వయంతో ముందుకెళ్లాలని కోరినారు. ఆరోగ్యం పట్ల, కుటుంబాల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.ఎస్పీ వెంట పోలీస్ సంఘం అధ్యక్షులు రామచందర్ గౌడ్ సిబ్బంది ఉన్నారు.
