ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా

TEJA NEWS

ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యలను పరిష్కరిoచడానికి ప్రతి వార్డు సభ్యుడు పని చేయాలి…..

పెద్దపల్లి //గోదావరిఖని పార్టీలకు అతీతంగా నగరాభివృద్దికి పాటుపడదామని రామగుండం నగర మేయర్ మహంకాళి స్వామి అన్నారు. బి ఆర్ ఎస్ సభ్యులచే మేయర్ ఛాంబర్ లో ప్రమాణ స్వీకారం చేయించారు.

ఈ సoధర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా వారి సమస్యలను పరిష్కరిoచడానికి ప్రతి వార్డు సభ్యుడు పని చేయాలని అన్నారు. రామగుండం శాసన సభ్యులు ఎం . ఎస్. రాజ్ ఠాకూర్ నగర అభివృద్దికి అవసరమైన నిధులు తెస్తున్న తరుణంలో ప్రజల సమస్యలు గుర్తించి సాధ్యమైనంత త్వరగా పరిష్కరిద్దామని అన్నారు.

సుమారు 800 కోట్ల రూపాయల నిధులతో అభివృద్ది కొనసాగుతున్నదని కాగా ఈ సంధర్భంగా బి ఆర్ ఎస్ పార్టీ సభ్యులు ఆకారపు రేఖ ( 51వ.డివిజన్ ) , కర్క పద్మజ ( 55వ. డివిజన్ ) , తాళ్ల చిన్న రాజయ్య ( 20వ. డివిజన్ ) , దారంగుల కుమార్ ( 28వ.డివిజన్ ) , నిమ్మరాజుల రజిని ( 29వ. డివిజన్ ) , బదావత్ నర్సమ్మ ( 26వ. డివిజన్ ) , బుర్ర శశికళ ( 15వ. డివిజన్ ) , మేకల శారద ( 60వ. డివిజన్ ) మేకల సమ్మయ్య ( 58వ. డివిజన్ ) , రమ మందల ( 16వ. డివిజన్ ) , శ్యామణి ఆవుల ( 6 వ డివిజన్ ) ప్రమాణ స్వీకారం చేశారు . ఈ కార్యక్రమంలో నగర పాలక సంస్థ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి వి రామన్ , ఎ సి పి శ్రీహరి , టి పి ఎస్ నవీన్ , సూపరింటెండెంట్ పబ్బాల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

You cannot copy content of this page

Scroll to Top