తెలంగాణ మైనారిటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప కానుక ఇచ్చారు అని, తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది అని ,1. ఈ స్కూటర్ 2. టూల్ కిట్లు రెండు సరికొత్త పథకాలను ప్రారంభించింది అని .అర్హులైన లబ్ధిదారులు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ తెలంగాణ మైనారిటీలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గొప్ప కానుక ఇచ్చారు అని, తెలంగాణ మైనారిటీల సంక్షేమం కోసం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చరిత్రాత్మక అడుగు వేసింది అని,రాష్ట్ర ప్రభుత్వం,మైనార్టీల ఆర్థికాభివృద్ధి, స్వయం ఉపాధి అవకాశాల కల్పన లక్ష్యంగా తెలంగాణ మైనారిటీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం పథకం 2025- 26 ఆర్థిక సంవత్సరానికి అమలులోకి తీసుకువచ్చినట్లు, అర్హులైన ప్రతి ఒక్కరు ఈ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
పేద ముస్లిం వారికి టూల్ కిట్లు మరియు జనరేటర్ల పంపిణీ ,రాళ్లు కత్తిరించే వృత్తిలో నిమగ్నమైయిన వారికి పునరావాసం, జీవనోపాది పెరుగుదల లక్ష్యంగా ఈ పథకం అమలు చేయబడుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు. ఈ పథకం ప్రతి లబ్దిదారుడికి రూ. 60,000 రూపాయలు చొప్పున,రూ. 10,000 విలువైన టూల్ కిట్,రూ. 50,000 ల విలువైన జనరేటర్ ను 100 శాతం సబ్సిడీతో ఒకేసారి అందించబడుతుంది అని,
అదేవిధంగా రెండవది మైనారిటీ యువతకు ఎలక్ట్రికల్ ఈ స్కూటర్ల పంపిణీ పథకంలో భాగంగా మైనార్టీ యువత(పురుషులు) ఆర్థికంగా బలోపేతం కావడానికి ,ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ఎలక్ట్రికల్ స్కూటర్ అమలులో ఉంది. ఈ పథకంలో ఈ స్కూటర్ యూనిట్ వ్యయం సుమారు రూ. 1.50 లక్షలు కాగా అందులో 80 శాతం సబ్సిడీ (రూ.1.20 లక్షలు) ప్రభుత్వం అందిస్తుంది అని, మిగతా 20 శాతం( రూ.30,000) లబ్దిదారుడి వాటా గా ఉంటుంది అని, ఎంపికైన లబ్ధిదారులను ఉబర్/ రాపిడో/ ఓలా వంటి సేవా సంస్థలతో అనుసంధానం చేయడం ద్వారా స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం జరుగుతుంది అని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు .పైన పేర్కొన్న రెండు పథకాల కోసం ఆన్లైన్ దరఖాస్తులు తేదీ 20.2.26 నుండి 1.3.26 తేదీ వరకు
రెండు పథకాల కింద ప్రయోజనాలను పొందడానికి TGOBMMS వెబ్ సైట్ tgobmms.cgg.gov.in లో ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలని
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రారంభ తేదీ: 20.02.2026
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ముగింపు తేదీ: 01.03.2026 అర్ధరాత్రి వరకు ఉండును అని, అరులైన ప్రతి ఒక్కరూ, ముస్లిం అండ్ మైనారిటీ యువత సద్వినియోగం చేసుకోవాలని PAC చైర్మన్ గాంధీ తెలియచేసారు.
